KCR: కేసీఆర్‌కు సంఘీభావం తెలిపిన చింతమడక గ్రామస్థులు

భారాస అధినేత కేసీఆర్‌ను బుధవారం ఆయన స్వగ్రామం చింతమడక వాసులు పెద్ద ఎత్తున కలిశారు.

Published : 06 Dec 2023 17:53 IST

గజ్వేల్‌: భారాస అధినేత కేసీఆర్‌ను బుధవారం ఆయన స్వగ్రామం చింతమడక వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి కలిశారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ను కలిసి తమ సంఘీభావం తెలిపారు. ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చింతమడక గ్రామస్థులకు కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. హరీశ్‌రావు, పలువురు భారాస నేతలు కూడా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని