వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత

మాజీ మంత్రి వివేకానందరెడ్డి 40 ఏళ్లుగా ఈ ప్రాంతానికి సేవ చేశారని ఆయన కుమార్తె సునీత అన్నారు. వివేకాను అత్యంత దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 18 Apr 2024 16:03 IST

పులివెందుల: మాజీ మంత్రి వివేకానందరెడ్డి 40 ఏళ్లుగా ఈ ప్రాంతానికి సేవ చేశారని ఆయన కుమార్తె సునీత అన్నారు. వివేకాను అత్యంత దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందులలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు మద్దతుగా ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. న్యాయం కోసం తాము పోరాడుతున్నామని.. షర్మిలను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.  

‘‘ప్రజలను కదిలిస్తే ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. అందరిలోనూ చెప్పుకోలేని బాధ ఎక్కువగా ఉంది. పులివెందుల ప్రజలతో పాటు నేనూ బాధపడుతున్నా. దీన్ని మే 13న జరిగే ఎన్నికలలో ఓట్ల రూపంలో చూపించాల్సిన అవసరముంది. వివేకానందరెడ్డిని దారుణంగా చంపించిన వారిని ఓడించాలి. ఆయన వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు. వీటన్నింటికీ ప్రజలే ఓట్ల ద్వారా తీర్పు చెప్పాలి’’ అని సునీత కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని