MLC election: మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.

Published : 02 Jun 2024 08:16 IST

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో కౌంటింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా 1,437 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్‌ కోసం మొత్తం ఐదు టేబుళ్లు ఏర్పాటు చేశారు. నాలుగు టేబుళ్లపై 300 ఓట్లు, మరో టేబుల్‌పై 237 ఓట్ల చొప్పున లెక్కిస్తారు. ఈ ఎన్నికల్లో మన్నె జీవన్‌రెడ్డి (కాంగ్రెస్‌), నవీన్‌కుమార్‌రెడ్డి (భారాస), సుదర్శన్‌గౌడ్‌ (స్వతంత్ర) పోటీ చేశారు. మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి శాసనసభ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. మార్చి 28న పోలింగ్‌ నిర్వహించగా.. మరోవైపు సార్వత్రిక ఎన్నికలు సాగుతుండడంతో ఉప ఎన్నిక కౌంటింగ్‌ను ఇప్పటివరకు పెండింగులో ఉంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు