DKS: ఆ విషయం చెప్పించుకోవాల్సిన అవసరం మాకు లేదు: శివకుమార్‌

మతాన్ని తాము పబ్లిసిటీ కోసం వాడుకోబోమని, మతం, భక్తి గురించి ఎవరితోనో చెప్పించుకోవాల్సిన అవసరం తమకు లేదని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ అన్నారు.

Published : 21 Jan 2024 18:37 IST

బెంగళూరు:  మతం, భక్తి గురించి ఎవరితోనో చెప్పించుకోవాల్సిన అవసరం తమకు లేదని కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ (DK Shivakumar) అన్నారు.  మన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను తాము ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్నామని చెప్పారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక వేళ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించకపోవడాన్ని ఆయన సమర్థించుకున్నారు. ఆదివారం తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు.  అయోధ్యలో శ్రీరామ మందిర ప్రతిష్ఠాపనకు సోమవారం సెలవు ప్రకటించాలన్న భాజపా నేతల డిమాండ్‌పై స్పందించిన డీకేఎస్‌..  మందిరం అంశాన్ని వాళ్లు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రాణప్రతిష్ఠ తర్వాత.. ఆలయం తదుపరి ప్రణాళిక ఏంటంటే?!

‘‘మతాన్ని మేం పబ్లిసిటీ కోసం వాడుకోం. ప్రార్థనలు ఫలితాన్ని ఇస్తాయని మేం విశ్వసిస్తాం. అందువల్లే ఎవరూ అడగకముందే దేవాదాయశాఖ పరిధిలోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఆదేశాలు జారీచేశాం. మతం, భక్తి విషయంలో ఎవరి ఉపన్యాసాలూ మాకు అవసరం లేదు. సిద్ధరామయ్య పేరులో రామ, నా పేరులో శివ ఉన్నాయి. మన సంప్రదాయాలు, ఆచారవ్యవహారాలేంతో మాకు తెలుసు. రాజకీయాల్లో ధర్మం ఉండాలి గానీ.. ధర్మంలో రాజకీయాలు ఉండొద్దు’’ అని శివకుమార్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు, తుమకూరులో సీఎం సిద్ధరామయ్య విలేకర్లతో మాట్లాడుతూ.. సోమవారం సెలవు లేదని తేల్చి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని