Bandi Sanjay: భారాస, కాంగ్రెస్‌ పార్టీల డీఎన్‌ఏల్లో బీసీలపై వ్యతిరేకత: బండి సంజయ్‌

భారాస ప్రభుత్వం యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా మారుస్తుందని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు. కరీంనగర్‌లో స్థానికంగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భారాస, కాంగ్రెస్‌ పార్టీల డీఎన్‌ఏల్లో బీసీ వ్యతిరేకత ఉందన్నారు. 

Updated : 08 Nov 2023 12:41 IST

కరీంనగర్: భారాస ప్రభుత్వం యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా మారుస్తోందని కరీంనగర్‌ ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ ఆరోపించారు. కరీంనగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భారాస, కాంగ్రెస్‌ పార్టీల డీఎన్‌ఏల్లో బీసీలపై వ్యతిరేకత ఉందన్నారు. 

బీసీ, దళితులను సీఎం అభ్యర్థిగా భారాస ప్రకటిస్తుందా అని సంజయ్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను గెలిపిస్తే భారాసకు అమ్ముడుపోతారన్నారు. భారాస నుంచి విముక్తి పొందాలంటే భాజపాను గెలిపించాలని ఆయన కోరారు. రెండురోజుల క్రితం కరీంనగర్‌ అసెంబ్లీ స్థానానికి బండి సంజయ్‌ నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని