₹2వేల నోటు ఉపసంహరణ నిర్ణయమూ అలాంటిదే.. సీఎం సోరెన్‌ విమర్శలు!

రూ.2వేల నోటు ఉపసంహరణపై ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ విమర్శలు చేశారు. ఇది కూడా గతంలో చేసిన పెద్ద నోట్ల రద్దులాంటి రాజకీయ నిర్ణయమేనని వ్యాఖ్యానించారు.

Published : 21 May 2023 17:19 IST

రాంచీ: దేశంలో చలామణి నుంచి రూ.2వేల నోట(Rs.2000 Notes)ను ఉపసంహరించుకొంటున్నట్టు శుక్రవారం ఆర్‌బీఐ(RBI) చేసిన సంచలన ప్రకటనపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. తాజాగా  ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌(Hemant Soren) ఈ వ్యవహారంపై స్పందించారు. 2016లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన మాదిరిగా ఇప్పుడు ఇది కూడా పూర్తిగా రాజకీయ నిర్ణయమేనని విమర్శించారు. అప్పుడు భాజపా తన రాజకీయ ఉనికిని కాపాడుకొనేందుకు పెద్ద నోట్లను రద్దు చేసిన మాదిరిగానే ఇప్పుడు ఇది కూడా పూర్తిగా రాజకీయ నిర్ణయమేనని ఆయన ఓ ఈవెంట్‌లో వ్యాఖ్యానించారు. కాకపోతే..  అవి ప్రజల ముందు బహిర్గతమైపోయాయన్నారు. దురదృష్టవశాత్తు రూ.2వేల కరెన్సీ నోటు లైఫ్‌ కేవలం ఏడేళ్లే ఉందన్నారు.  గతంలో చలామణీలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో దాదాపు 2లక్షలకు పైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయని గుర్తు చేశారు. కెమెరాలు, మొబైల్ ఫోన్లు.. ఇలా ఏ వస్తువుకైనా లైఫ్‌ ఉంటుందన్న ఆయన.. రూ.2వేల నోటు లైఫ్‌ మాత్రం కేవలం 6-7 ఏళ్లే కొనసాగిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని