Nara Lokesh: నారా లోకేశ్‌ సమక్షంలో తెదేపాలోకి భారీగా చేరికలు

గుంటూరు జిల్లాల్లోని పలు నియోజకవర్గాలకు చెందిన వైకాపా నేతలు బుధవారం లోకేశ్‌ సమక్షంలో తెదేపాలో చేరారు.

Updated : 17 Apr 2024 16:23 IST

గుంటూరు: కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పార్టీ తెదేపా అని, వారి సంక్షేమం కోసం రూ.100 కోట్లకుపైగా నిధులు కేటాయించామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలిపారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు. తెదేపాకి 70 లక్షల మంది కార్యకర్తలే ఆస్తి అని, తెలుగుజాతి అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తామని చెప్పారు. గుంటూరు జిల్లాల్లోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వైకాపా నేతలు బుధవారం లోకేశ్‌ సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో పసుపు జెండా ఎగురవేసేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు, పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 50 మంది సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ కౌన్సిలర్లు తెదేపాలో చేరారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సుభానితో పాటు దాదాపు 500 మంది నాయకులు, కార్యకర్తలు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ లోకేశ్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు