YS Sharmila: తిరుపతి వేదికగా ప్రత్యేక హోదాపై డిక్లరేషన్‌ ప్రకటిస్తాం: వైఎస్‌ షర్మిల

తిరుపతిలో మార్చి 1న జరగనున్న బహిరంగ సభ ద్వారా ఏపీకి ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ ఇస్తామని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు. 

Updated : 28 Feb 2024 16:00 IST

విజయవాడ: తిరుపతిలో మార్చి 1న జరగనున్న బహిరంగ సభ ద్వారా ఏపీకి ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ ఇస్తామని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు. అధికార వైకాపా ప్రత్యేక హోదాపై మాటలు మాత్రమే చెప్పిందన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

‘‘ఏపీని హార్డ్ వేర్ హబ్‌గా మారుస్తామని, చమురు రిఫైనరీలు ఇస్తామని మోదీ చెప్పారు. వాటిలో ఒక్కమాటా నిలబెట్టుకోలేదు. పదేళ్లుగా ఏపీ ప్రజలను భాజపా మోసం చేసింది. ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలకు పరిశ్రమలు వస్తాయి.. తద్వారా ఉద్యోగాలు వస్తాయి. మరి ఏపీకి ఏం వచ్చాయి? కనీసం 10 పరిశ్రమలు కూడా రాలేదు. ఉద్యోగాలు దొరక్క యువత పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారు. యువత లేని రాష్ట్రంగా ఏపీ తయారవుతోంది. మెగా డీఎస్సీ అని దగా చేశారు. జాబ్ క్యాలెండర్‌ అని జగన్‌.. యువతను మోసం చేశారు. ప్రత్యేక హోదా పేరు చెప్పి ఓట్లు దండుకున్నారే తప్ప.. ఎవరూ పోరాటం చేయలేదు. ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేత లాంటి నిర్ణయాలు అమలు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి’’ అని షర్మిల వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని