YSRCP: అనకాపల్లి ఎంపీ, మాడుగుల అభ్యర్థులను ప్రకటించిన వైకాపా

ఎట్టకేలకు అనకాపల్లి వైకాపా ఎంపీ అభ్యర్థిని ఆ పార్టీ ప్రకటించింది.

Updated : 26 Mar 2024 20:17 IST

అమరావతి: ఎట్టకేలకు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని వైకాపా ప్రకటించింది. ఇటీవల 24 పార్లమెంట్‌, 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జగన్‌.. అనకాపల్లి సీటును పెండింగ్‌లో పెట్టారు. తాజాగా ఈ స్థానానికి మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడిని ఖరారు చేసినట్టు వైకాపా అధిష్ఠానం మంగళవారం సాయంత్రం ప్రకటించింది. ఇప్పటికే తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థిగా సీఎం రమేశ్‌ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మాడుగుల అసెంబ్లీ స్థానానికి ముత్యాల నాయుడు కుమార్తె ఈర్ల అనూరాధను అభ్యర్థిగా నియమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని