Vijayawada: వైకాపా బరితెగింపు.. ఎన్నికల అధికారులపై దురుసు ప్రవర్తన

ఎన్నికల అధికారులపై విజయవాడకు చెందిన వైకాపా నేత దురుసుగా ప్రవర్తించారు. 

Published : 13 Apr 2024 18:36 IST

విజయవాడ: ఎన్నికల అధికారులపై విజయవాడకు చెందిన వైకాపా నేత దురుసుగా ప్రవర్తించారు. తన అనుచరులతో కలిసి దౌర్జన్యానికి దిగారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో విజయవాడ 58వ డివిజన్‌ కృష్ణ హోటల్‌ సెంటర్లో ఉన్న వైకాపా జెండాలను మున్సిపల్ అధికారులు తొలగిస్తుండగా.. అక్కడికి చేరుకున్న డిప్యూటీ మేయర్‌ శైలజారెడ్డి భర్త శ్రీనివాస్‌రెడ్డి అధికారులపై విరుచుకుపడ్డారు. మా పార్టీ జెండాలు తీయడానికి మీరెవరంటూ వాగ్వాదానికి దిగారు. మున్సిపల్‌ సిబ్బంది స్వాధీనం చేసుకుని వ్యాన్‌లో వేసిన జెండాలను తీసి బలవంతంగా వైకాపా కార్యాలయానికి తరలించారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున రాజకీయ పార్టీల జెండాలు కట్టాలంటే అనుమతి తీసుకోవాలని అధికారులు చెప్పినా ఖాతరు చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని