TDP: భీమిలి నియోజకవర్గంలో తెదేపాలోకి క్యూ కడుతున్న వైకాపా నేతలు

 విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో వైకాపా నాయకులు తెదేపాలోకి క్యూ కడుతున్నారు.

Published : 22 Apr 2024 16:09 IST

భీమిలి: విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో వైకాపా నాయకులు తెదేపాలోకి క్యూ కడుతున్నారు. ఆదివారం కుసులువాడ గ్రామ పంచాయతీ మొత్తం తెదేపాలోకి చేరగా.. తాజాగా కొవ్వాడ సర్పంచ్, ఉప సర్పంచ్‌ తమ అనుచరులతో కలిసి భీమిలి అసెంబ్లీ తెదేపా అభ్యర్తి గంటా శ్రీనివాసరావు సమక్షంలో పసుపు కండువాలు కప్పుకొన్నారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ.. సీఎం జగన్‌ అరాచక పాలనలో విసిగి పోయిన రాష్ట్ర ప్రజానీకం చంద్రబాబు సుపరిపాలన కోసం ఎదురు చూస్తోందని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా జగన్‌ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. పథకాల్లో కోతలు పెడుతూ పేద ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు. 

దుక్కవానిపాలెం నుంచి..

ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ దుక్కవానిపాలెం గ్రామానికి చెందిన సీనియర్ వైకాపా నాయకుడు ఇల్లిపిల్లి ముసలయ్యను కండువా కప్పి గంటా శ్రీనివాసరావు తెదేపాలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెదేపా ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు, సర్పంచ్ లక్ష్మి, ఈశ్వరరావు, ఉప సర్పంచ్ శ్రీను పాల్గొన్నారు. మరోవైపు పద్మనాభం మండంలోని పలువురు వైకాపా నేతలు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని