Mangalagiri: పిన్నెల్లి సోదరులపై జీరో ఎఫ్‌ఐఆర్‌

పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిపై జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు మంగళగిరి పోలీసులు ఎట్టకేలకు అంగీకరించారు.

Updated : 27 May 2024 06:02 IST

మంగళగిరి, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిపై జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు మంగళగిరి పోలీసులు ఎట్టకేలకు అంగీకరించారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ వెల్దుర్తి మండలం కండ్లకుంటకు చెందిన తెదేపా కార్యకర్త నోముల మాణిక్యరావు తన న్యాయవాది లక్ష్మీనారాయణతో కలసి ఆదివారం సాయంత్రం మంగళగిరి గ్రామీణ పోలీసుస్టేషన్‌కు వచ్చారు. అక్కడి పోలీసులకు ఫిర్యాదు అందజేయగా, వారు ఇక్కడ తీసుకోవడం కుదరదంటూ తిరస్కరించారు. చివరకు తెదేపా నేతలతో కలిసి డీజీపీని ఆదివారం రాత్రి కలిశారు. ఆయన ఆదేశాలతో ఎట్టకేలకు పోలీసులు బాధితుడి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు అంగీకరించారు. 

రాత్రి 10 గంటల సమయంలో బాధితుడు మాణిక్యరావు తన న్యాయవాది లక్ష్మీనారాయణ తదితరులతో కలిసి ఫిర్యాదు అందజేశారు. ఈ నెల 13న కండ్లకుంటలో జరిగిన దారుణాల గురించి మాణిక్యరావు పోలీసులకు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని