ఫిట్‌నెస్‌లో వి‘రాటుదేలండి’..!
చిత్రాలు: తన అధికారిక ట్విటర్ ఖాతా నుంచి..
ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తచ్చేది క్రికెట్. తరువాత ఫిట్‌నెస్. ఫిట్‌నెస్‌కి ఫీచర్ లుక్కిస్తాడీ యువ సారథి. భారత క్రికెట్ జట్టు సభ్యులందరూ ఫిట్‌నెస్‌లో ప్రేరణ పొందేది తన నుంచే. వ్యాయామం, డైట్‌కి అంతలా ప్రాధాన్యమిస్తాడు కోహ్లీ. మరి ఒకప్పుడు చాలా బొత్తుగా ఉండే విరాట్ ఇంత ఫిట్‌గా ఎలా మారాడు? తను చెప్పిన ఫిట్‌నెస్ రహస్యాలేంటి? తన రోజు వారీ డైట్ మాటేంటి? ఓ సారి తెలుసుకుందాం. వీలైతే పాటించేద్దాం.
బేసిక్‌తో మొదలెట్టండి
బరువు తగ్గాలంటే బేసిక్‌తో మొదలెట్టాల్సిందే. మరి వ్యాయామంలో బేసిక్ ‘పరుగెత్తడం’. అందుకే దానికి అధిక ప్రాధాన్యమివ్వాలి. వికెట్ల మధ్య చిరుతలా పరుగెత్తే విరాట్‌ని చూస్తుంటాం. ఆ పరుగుకి రోజువారీ ప్రాక్టీస్ ఎంతో ఉపయోగపడుతుందంటాడు కోహ్లీ. అదే తనని ఫిట్‌గా మార్చిన మొదటి అస్ర్తం అని చెబుతాడు. పరుగు కేవలం బరువు తగ్గేందుకే కాదు శరీరానికి కావాల్సిన సత్తువతో పాటు మానసిక ప్రశాంతతనీ ఇస్తుందంటాడు విరాట్.
దానికి మీరు సిద్ధమా?
రోజూ వ్యాయామం చేస్తున్నారా? పుష్-అప్స్ అందులో భాగమా?ఎక్కువ పుష్-అప్స్ చేసి అందులో అనుభవజ్ఞులయ్యారా? అయితే విరాట్ ఇచ్చే ఈ ఛాలెంజ్‌ని స్వీకరించండి. పేరు ‘వన్ ఆమ్ పుష్-అప్స్’ ఛాలెంజ్. అంటే ఒంటి చేత్తో పైకి లేవడం. కోహ్లీ ఎక్కువగా ఈ వర్కవుట్‌ని ప్రయత్నిస్తాడంట. ఓసారి మీరూ ప్రయత్నించి మీ సోషల్ ఖాతాల్లో పోస్ట్ చేయండి. మీ స్నేహితులకూ సవాల్ విసరండి.
బరువులెత్తండి
మీరెంతగా బరువు ఎత్తితే మీ కండరాలు అంత ఫిట్‌గా తయారవుతాయి. బరువులు ఎత్తే క్రమంలో మీ రోజువారీ లక్ష్యాలను ఏర్పాటు చేసుకోండి. రోజురోజుకీ మెరుగుపరుచుకోండి. విరాట్‌కి వెయిట్ లిఫ్టింగ్ అంటే చాలా ఇష్టం. తన వ్యాయామంలో ‘వెయిట్ లిఫ్టింగ్’కి అధిక ప్రాధాన్యమిస్తాడీ సారథి. దీంతో కండరాలు దృఢంగా తయారవుతాయని చెప్పుకొస్తాడు. దీంతోపాటు ఈతని మీ వ్యాయామంలో భాగం చేయాలని చెబుతాడు. ఇది శరీరంలోని ప్రతీ భాగానికి పనిచెప్తుంది. అధిక కెలరీలను ఖర్చు చేస్తుందంటాడు.
ఆరుపలకల దేహం కోసమా!
కోహ్లీలా మీరూ సిక్స్‌ప్యాక్ కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే క్రంచెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టండి. మీకు వచ్చిన.. మనసుకు నచ్చిన ఫ్లోర్ క్రంచెస్ చేస్తే ఆరుపలకల దేహం అంత సులభం కాదు. ‘బార్ క్రంచెస్’ ప్రయత్నించండి. అంటే ఏదైన ఎత్తున ఉన్న వస్తువు సాయంతో ఛాతిని, కాళ్లని పైకీ, కిందకీ జరపడం. ఇది మీ పొట్టభాగాన ఉన్న అనవసరపు కొవ్వును త్వరగా తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.
తనలా స్మార్ట్..స్మార్ట్‌గా..
వ్యాయామంతో శరీరాన్ని ఎక్కువగా కష్టపెట్టేస్తున్నారా? అయితే కోహ్లీలా కాస్త స్మార్ట్‌గా కష్టపెట్టండి. ఓ సారి ఓ పార్ట్ వ్యాయామమే కాదు. శరీరంలోని అన్ని కండరాలకీ ఒకేసారి పనిచెప్పే ‘మల్టిపుల్ మజిల్ వర్కవుట్లు’ చేయండి. దీంతో ఎక్కువ కెలరీలు ఖర్చవుతాయి. తక్కువ కాలంలో అనవసరపు కొవ్వును కరిగించి ఫిట్‌గా తయారవచ్చు. వ్యాయామం చేసేప్పుడు ఎంత బరువు తగ్గుతున్నామనేది కాకుండా ఎంత స్టామినా సంపాదిస్తున్నామన్నదే ముఖ్యం అంటాడీ కెప్టెన్.
అసలే మరవద్దు..
ఇక రేపట్నుంచి ఉదయమే లేచి వ్యాయామం మొదలెట్టాలనుకుంటాం. ఓ వారం రోజులు శరీరాన్ని తెగ కష్ట పెట్టేస్తాం. పరుగెత్తుతాం, బరువులు ఎత్తేస్తాం, పుష్-అప్స్, సిట్-అప్స్ ప్రయత్నిస్తాం. ఇక వారాంతంలో ఓ రోజు ఇచ్చిన విరామంతో పూర్తి వ్యాయామానికి చెక్ పెట్టేస్తాం. దీంతో మీ ఫిట్‌నెస్ లక్ష్యం అక్కడే ఆగిపోతుంది. అందుకే క్రమం తప్పక వ్యాయామం అవసరం. విరాట్ అంత ఫిట్‌గా తయారయ్యారంటే తన నిబద్దతే. వారంలో ఐదు రోజులు.. రోజులో రెండు గంటలు తప్పక వ్యాయామానికి సమయం కేటాయిస్తాడు కోహ్లీ. అంతేకాదు టెన్నీస్, ఫుట్‌బాల్ వంటి ఆటలూ ఆడేస్తాడు.
డైట్ తప్పని సరి
మీరు తినే ఆహారం ఎలాంటిదో మీకు తెలుసు. దాని వల్ల మీ ఆరోగ్యానికి లాభమా? నష్టమా కూడా మీకు తెలుసు. అలాంటప్పుడు మీ ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించే ఆహారాన్ని ఎందుకు తీసుకుంటారంటాడు విరాట్. ఆరోగ్యకరమైన డైట్ పాటించాలని చెబుతాడు. తను తీసుకునే ఆహారంలో ఎక్కువగా ప్రొటీన్, విటమిన్, మినరల్స్ ఉండే విధంగా చూసుకుంటాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
రత్న భాండాగారం తెరవాలి.. పూరీ ఆలయ యంత్రాంగానికి పురావస్తు శాఖ లేఖ
-
India News
Yamuna River: ప్రమాదకర స్థాయిలో యమునా నది ప్రవాహం
-
World News
Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
-
India News
Nupur Sharma: నుపుర్ శర్మ హత్యకు కుట్ర? ఉగ్రవాది అరెస్టు
-
Movies News
Kalapuram: పవన్ కల్యాణ్ పరిచయం చేసిన ‘కళాపురం’.. ఆసక్తిగా ట్రైలర్
-
World News
కరవు కోరల్లో ఇంగ్లాండ్.. ఖాళీగా రిజర్వాయర్లు.. నీటి వాడకంపై ఆంక్షలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Salman Rushdie: ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై దాడి.. స్టేజిపైనే కత్తిపోట్లు!
- Fahadh Faasil MALIK Review: రివ్యూ: మాలిక్
- Munugode: మునుగోడు కాల్పుల కేసు.. వివాహేతర సంబంధమే కారణం: ఎస్పీ
- Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీల పెళ్లి సందడి.. టీజర్ చూశారా!
- Tejashwi Yadav: నీతీశ్ నిర్ణయం ‘భాజపాకు చెంపపెట్టు’
- The Great Khali: అభిమానుల చర్యకు ఏడ్చేసిన ‘ది గ్రేట్ ఖలీ’
- Ranveer singh: న్యూడ్ ఫొటోషూట్.. రణ్‌వీర్‌సింగ్ ఇంటికి పోలీసులు!
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Kalapuram: పవన్ కల్యాణ్ పరిచయం చేసిన ‘కళాపురం’.. ఆసక్తిగా ట్రైలర్