duleep trophy: అద్భుత సెంచరీలు చేసిన అంకిత్‌ కుమార్‌, యశ్‌ ధుల్‌..

Eenadu icon
By Sports News Team Published : 31 Aug 2025 00:11 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: దులీప్ ట్రోఫీలో (duleep trophy) భాగంగా నార్త్‌జోన్‌, సౌత్‌జోన్‌కు మధ్య క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగుతోంది. ఇందులో రెండో ఇన్నింగ్స్‌లో నార్త్‌జోన్‌ కెప్టెన్‌ అంకిత్‌ కుమార్‌ (ankit-kumar) (264 బంతుల్లో 168*), యశ్‌ ధుల్‌ (yash-dhull) (157 బంతుల్లో 133) అద్భుత సెంచరీలు నమోదు చేశారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి నార్త్‌ జోన్‌ రెండు వికెట్ల నష్టానికి 388 పరుగులు చేసి పటిష్ఠ స్థితిలో ఉంది. దీంతో సెమీఫైనల్‌కు వెళ్లే అవకాశాలు నార్త్‌జోన్‌కు మెరుగయ్యాయి. రెండో వికెట్‌కు అంకిత్‌, ధుల్‌ 290 బంతుల్లో 240 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ధుల్‌ దూకుడుగా ఆడితే, పరిస్థితులకు అనుగుణంగా అంకిత్‌ బ్యాటింగ్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

ఓపెనర్‌ శుభమ్‌ ఖజురియా (41 బంతుల్లో 21)ను సూరజ్ జైస్వాల్ త్వరగానే ఔట్ చేశాడు. అయితే ఆ తర్వాత అంకిత్‌, ధుల్‌ క్రీజులో పాతుకుపోయారు. వీరిపై బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. అయితే టీమ్ఇండియా (Team India) సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ (Mohammed Shami) మధ్య మధ్యలో బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. కానీ వారిపై పై చేయి మాత్రం సాధించలేకపోయాడు. 

ధుల్‌ ఔటైన తర్వాత వచ్చిన ఆయుష్‌ బదోనీ కూడా అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. అతడు 78 బంతుల్లో 56 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌ మాత్రమే తీసుకున్న షమీ.. రెండో ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. 11 ఓవర్లు సంధించిన అతడు 36 పరుగులు ఇచ్చాడు. సూరజ్‌ సింధు జైస్వాల్‌, రియాన్‌ పరాగ్‌ తలో వికెట్‌ తీసుకున్నారు. 

దులీప్‌ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మరో క్వార్టర్‌ ఫైనల్‌లో సెంట్రల్‌ జోన్‌, నార్త్‌ ఈస్ట్‌ జోన్‌ తలపడుతున్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో సెంట్రల్‌ జోన్‌ 6 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. శుభమ్‌ శర్మ సెంచరీతో (215 బంతుల్లో 122 పరుగులు) ఆకట్టుకున్నాడు. రజత్‌ పాటిదార్‌ (72 బంతుల్లో 66), యశ్‌ రాథోడ్‌ (83 బంతుల్లో 78) రాణించారు. నార్త్‌ ఈస్ట్‌ జోన్‌ బౌలర్లలో ఆకాశ్‌ చౌదరీ, బిశ్వర్జిత్ సింగ్ కొంతౌజం తలో రెండు వికెట్లు, జోతిన్‌ ఫెరోయిజామ్‌, అంకుర్‌ మాలిక్‌ తలో వికెట్‌ తీసుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని