Ashwin: ఇవాళ గుజరాతీ ఫుడ్‌ ఫేవరేట్‌.. టీమ్‌ అధికారిక భాషగా తెలుగు: సహచరులతో అశ్విన్‌

టీమ్ఇండియా సీనియర్‌ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ (ASHWIN) ట్విటర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. సందర్భానుసారం ట్వీట్లతో అభిమానులను అలరిస్తూ ఉంటాడు. తాజాగా అతడు చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది.

Published : 21 May 2023 20:00 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్‌లో (IPL 2023) ఒక్క ప్లేఆఫ్స్ బెర్తు కోసం మూడు జట్లు పోటీలో నిలిచాయి. తొలి మూడు స్థానాల్లో గుజరాత్, చెన్నై, లఖ్‌నవూ ఉండగా.. నాలుగో స్థానం ఎవరిదనేది తేలాల్సి ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (14 పాయింట్లు), ముంబయి ఇండియన్స్‌ (14 పాయింట్లు), రాజస్థాన్‌ రాయల్స్‌ (14 పాయింట్లు) పోటీ పడుతున్నాయి. రాజస్థాన్‌ తన మ్యాచ్‌ల కోటాను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ముంబయి ఆడుతోంది. రాత్రి 7.30 గంటలకు గుజరాత్‌తో బెంగళూరు తలపడనుంది. అయితే, ఆ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో రాజస్థాన్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ తన సహచరులను ఉత్సాహపరిచేందుకు చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 

‘‘ఇవాళ గుజరాత్‌ ఆహారం మనకు ఇష్టమైంది కావాలి. తెలుగు మన జట్టు అధికారిక భాష కావాలని జట్టు సహచరులకు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఇలా..’’ అని టీమ్‌ సభ్యులతో దిగిన ఫొటోను అశ్విన్‌ షేర్‌ చేశాడు. దీంతో నెటిజన్లు తమ కామెంట్లతో రెచ్చిపోయారు.

* జో రూట్‌ ఫొటోను పెడుతూ.. అతడు కన్విన్స్‌ అయిపోయినట్లు తెలుస్తోంది. 

* మా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గురించి సరిగ్గా తెలిసినట్లు లేదు. కలలు కంటున్నారు. ఏదిఏమైనా ఎస్‌ఆర్‌హెచ్‌కే మా సపోర్ట్‌.

* అశ్విన్‌ టైమింగ్‌ అంటే నాకు చాలా ఇష్టం. బౌలింగ్‌, మన్కడింగ్‌, ట్వీటింగ్‌.. ఇలా ఏదైనా సరే భావోద్వేగంతో చేస్తాడు. జై రాయల్స్‌!

* రాజస్థాన్‌ రాయల్స్‌ పూర్తిగా ఎస్‌ఆర్‌హెచ్‌, జీటీ మీద ఆశలు పెట్టుకున్నట్లు ఉంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని