IND vs AUS: అశ్విన్‌ను ఎదుర్కోవడం.. మా ఎడమ చేతివాటం బ్యాటర్లకు సవాలే: ఆసీస్‌ ఆటగాడు

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో దూసుకెళ్లడానికి కీలకమైన టెస్టు సిరీస్‌. అదీనూ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో (IND vs AUS) నాలుగు టెస్టులను టీమ్‌ఇండియా (Team India) వచ్చే నెలలో ఆడనుంది. ఈ క్రమంలో భారత సీనియర్‌ బౌలర్‌ అశ్విన్‌ (Ashwin)తో తమకు సవాల్‌ తప్పదని ఆసీస్‌ బ్యాటర్ ఒకరు వ్యాఖ్యానించాడు. 

Published : 26 Jan 2023 01:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఫిబ్రవరిలో భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌ జరగనుంది. ప్రస్తుతం టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC) పాయింట్ల టేబుల్‌లో ఇరు టీమ్‌లు తొలి రెండు స్థానాల్లో ఉన్న సంగతి తెలిసిందే. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవాలంటేఈ సిరీస్‌ కీలకం. నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో విజయం సాధిస్తే అగ్రస్థానంలోకి దూసుకెళ్లే అవకాశం ఉంది. ప్యాట్‌ కమిన్స్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా ఫిబ్రవరి 9 నుంచి భారత్‌తో తొలి టెస్టు మ్యాచ్‌ ఆడనుంది. ఈ క్రమంలో భారత బౌలర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం తమ లెఫ్ట్‌ఆర్మ్ బ్యాటర్లకు సవాల్‌గా మారే అవకాశం ఉందని ఆసీస్‌ బ్యాటర్ రెన్‌షా విశ్లేషించాడు. ఆ జట్టులో రెన్‌షాతోపాటు ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, అలెక్స్ క్యారీ ఎడమ చేతివాటం కలిగిన బ్యాటర్లు. 

‘‘బంతిని విభిన్నంగా సంధించడంలో అశ్విన్‌ దిట్ట. అందుకే అతడిని ఎదుర్కోవడం కష్టమే. తెలివైన బౌలర్‌ కావడంతో ఎప్పుడు ఎలా వేయాలో బాగా తెలుసు. అతడి బౌలింగ్‌ కొంచం అలవాటైతే.. సులభంగా ఎదుర్కొంటాం. స్పిన్‌ పరిస్థితులకు అనుకూలించే పిచ్‌లపై అశ్విన్‌ వంటి ఆఫ్‌ స్పిన్నర్‌ను లెఫ్ట్‌ఆర్మ్‌ బ్యాటర్లు ఆడటం పెద్ద సవాల్‌. ప్రతి ఒక్కరూ బంతి స్పిన్‌ కావడం వల్ల స్లిప్స్‌లో క్యాచ్‌లుగా మారే అవకాశం ఉందని భావిస్తుంటారు. అయితే ఒక్కోసారి బంతి తిరగకుండా ఎల్బీగా ఔటయ్యే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది. అయితే నేను దాదాపు రెండేళ్లపాటు ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేయడం వల్ల స్పిన్‌ను ఎదుర్కొని ఆడటం అలవాటైంది. కఠిన పరిస్థితుల్లో ఎలా ఆడాలనేదానిపై పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నా’’ అని రెన్‌షా తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు