PHL: ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌కు ఆసియా హ్యాండ్‌బాల్‌ ఫెడరేషన్‌ మద్దతు

భారత్‌ వేదికగా తొలిసారి నిర్వహిస్తున్న ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్‌ (PHL)కు ఆసియా హ్యాండ్‌బాల్‌ ఫెడరేషన్‌ మద్దతు తెలిపినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Published : 18 Mar 2023 16:02 IST

ముంబయి: భారత్‌ వేదికగా తొలిసారి నిర్వహిస్తున్న ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్‌ (PHL)కు ఆసియా హ్యాండ్‌బాల్‌ ఫెడరేషన్‌ మద్దతు తెలిపినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ మేరకు దక్షిణ ఆసియా హ్యాండ్‌బాల్‌ ఫెడరేషన్‌కు, బ్లూ స్పోర్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మధ్య వాణిజ్యపరమైన అగ్రిమెంట్‌కు ఆమోదం లభించిందని తెలిపారు. దీని వల్ల భారత్‌లో ఈ క్రీడ మరింత ఉన్నత స్థానాలకు చేరుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. 20 ఏళ్లపాటు పురుషుల హ్యాండ్‌బాల్‌ గేమ్‌ను ప్రమోట్‌ చేయడానికి ఆ అగ్రిమెంట్‌ హక్కులను కల్పించింది. 

ఈ సందర్భంగా బ్లూస్పోర్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మను అగర్వాల్‌, అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ ఫెడరేషన్ వైస్‌ ప్రెసిడెంట్‌ బడెర్ మహమ్మద్‌ మాట్లాడుతూ.. ‘‘ ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్ లీగ్‌కు ఇదొక అద్భుతమైన క్షణాలు. పీహెచ్‌ఎల్‌ వ్యవస్థను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతాం. భారత్‌లో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించేలా పీహెచ్‌ఎల్‌ మా వంతు కృషి చేస్తాం. ఏహెచ్‌ఎఫ్, దక్షిణ ఆసియా హ్యాండ్‌బాల్‌ ఫెడరేషన్ మద్దతుగా నిలవడం ఆనందంగా ఉంది. ఆసియాలో హ్యాండ్‌బాల్‌ గేమ్‌కు భారత్‌లో మంచి మార్కెట్‌ ఉంది’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని