Cameron green: గ్రీన్ తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చు: ఆసీస్ హెడ్ కోచ్
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ భారత టీ20 లీగ్‌లో ఆడటంపై ఆసీస్ ప్రధాన కోచ్ స్పందించాడు.
కాన్‌బెరా: భారత టీ20 లీగ్‌లోకి ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్(Cameron green) అరంగేట్రంపై ఆసీస్ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ లీగ్‌లో పాల్గొంటే దాదాపు 12 నెలలపాటు సరైన విరామం లేక విపరీతమైన ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రపంచకప్(World cup 2023) ముంగిట తన ప్రదర్శనపై ఇది ప్రభావం చూపుతుందని డేవిడ్ వార్నర్(David warner), పాట్ కమిన్స్ భావిస్తున్నారు. అయితే ఈ యువ ఆటగాడు మాత్రం అన్ని ఫార్మట్లలో ఆడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకే ఆసక్తి చూపుతున్నాడు. తాజాగా ఈ విషయంపై ఆస్ట్రేలియా జట్టు ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ స్పందించాడు. రానున్న మూడు నెలల్లో ఏదైనా జరగవచ్చని.. గ్రీన్ తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చునని అన్నాడు.
‘‘మార్చి నెలాఖరులోగా గ్రీన్ నిర్ణయంలో ఎలాంటి మార్పులు ఉంటాయో చూడాలి. ఎందుకంటే ఈ మూడు నెలల కాలంలోనే అతడు చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కచ్చితంగా భారత టీ20 లీగ్‌పై అతడు ఇప్పుడే ఓ నిర్ణయానికి రాడు. శరీరం ఎప్పుడు ఎలా స్పందిస్తుందో చెప్పలేం. రానున్న కొద్ది రోజుల్లో 9 టెస్టులు, ఒక వైట్ బాల్ క్రికెట్ మ్యాచ్ గ్రీన్ ఆడాల్సివుంది’’ అంటూ ఆండ్రూ తెలిపాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
PM-KUSUM: ‘పీఎం కుసుమ్’ పథకం 2026 వరకు పొడిగింపు
-
Politics News
Arvind Kejriwal: రాజకీయాల్లో ‘ఆమ్ఆద్మీ’ సక్సెస్.. ఎందుకంటే..!
-
Sports News
IPL 2023: అప్పటికల్లా.. ఫుట్‌బాల్ లీగ్ కంటే అతిపెద్ద ఈవెంట్ ఐపీఎల్ అవుతుంది: స్ట్రాస్
-
World News
Hong Kong: 5 లక్షల విమాన టికెట్లు ఫ్రీ.. పర్యాటకులకు హాంకాంగ్ ఆఫర్!
-
Movies News
Pawan Kalyan: సినిమాల నుంచి అప్పుడే రిటైర్డ్ అవ్వాలనుకున్నా.. నా పెళ్లిళ్లు అనుకోకుండానే..!: పవన్ కల్యాణ్
-
Politics News
Nitin Gadkari: నితిన్ గడ్కరీ ఇలాకాలో భాజపాకి ఎదురుదెబ్బ