Mitchell Starc: ఒక ఫార్మాట్‌ను వదిలేస్తానేమో: స్టార్క్‌

ఐపీఎల్‌-17లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఇకపై రెండు ఫార్మాట్లలోనే కొనసాగే అవకాశాలున్నాయి.

Published : 28 May 2024 02:48 IST

చెన్నై: ఐపీఎల్‌-17లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఇకపై రెండు ఫార్మాట్లలోనే కొనసాగే అవకాశాలున్నాయి. ఫ్రాంఛైజీ క్రికెట్‌పై ఎక్కువ దృష్టి పెట్టడం కోసం తాను వన్డే, టెస్టుల్లో ఒకదాన్ని వదిలేసే అవకాశం ఉందని అతడు చూచాయిగా తెలిపాడు. ‘‘గత తొమ్మిదేళ్లుగా ఆస్ట్రేలియాకు ఆడేందుకే ప్రాధాన్యత ఇచ్చా. శరీరం విశ్రాంతి కోరుకున్నప్పుడు.. కుటుంబంతో గడపటానికి మాత్రమే కొన్నిసార్లు విరామం తీసుకున్నా. ఇప్పుడు కెరీర్‌ చివరికి వచ్చింది. 2027 వన్డే ప్రపంచకప్‌ ఇంకా చాలా దూరం ఉంది. రాబోయే రోజుల్లో నేను వన్డే, టెస్టుల్లో ఒక ఫార్మాట్‌ మాత్రమే ఆడే అవకాశాలు లేకపోలేదు. అప్పుడు టీ20 క్రికెట్‌కు మరింత ఎక్కువ సమయం కేటాయించొచ్చు’’ అని స్టార్క్‌ పేర్కొన్నాడు. రాబోయే టీ20 ప్రపంచకప్‌కు ఐపీఎల్‌ మంచి సన్నద్ధతగా ఉపయోగపడిందని అతడు చెప్పాడు. ‘‘టీ20 ప్రపంచకప్‌ ముందు ఐపీఎల్‌ మంచి సన్నాహకంగా పనిచేసింది. అయితే వెస్టిండీస్‌లో పిచ్‌లు..భారత్‌కు భిన్నంగా ఉంటాయి. ఐపీఎల్‌ మాదిరిగా భారీ స్కోర్లు నమోదు కావు. స్పిన్నర్లకు సహకారం అందుతుంది. టోర్నీ గడిచేకొద్దీ బౌలర్లు కీలకమవుతారు’’ అని స్టార్క్‌ తెలిపాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు