IPL 2024 FINAL - Mitchell Starc: స్టార్క్‌ అంతే.. తీవ్ర ఒత్తిడి ఉండే మ్యాచ్‌ల్లోనే అద్భుత ప్రదర్శన

రూ.24.75 కోట్లు.. ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ కోసం నిరుడు వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వెచ్చించిన డబ్బు. ఐపీఎల్‌ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా మారిన స్టార్క్‌.. ఈ సీజన్‌లో మొదట అంచనాలను అందుకోలేకపోయాడు.

Updated : 27 May 2024 06:56 IST

రూ.24.75 కోట్లు.. ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ (Mitchell Starc) కోసం నిరుడు వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knight Riders) వెచ్చించిన డబ్బు. ఐపీఎల్‌ (IPL) చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా మారిన స్టార్క్‌.. ఈ సీజన్‌లో మొదట అంచనాలను అందుకోలేకపోయాడు. ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి ఐపీఎల్‌లో ఆడిన అతను తొలి 9 మ్యాచ్‌ల్లో 7 వికెట్లే పడగొట్టాడు. దీంతో స్టార్క్‌పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. కానీ ఇవన్నీ స్టార్క్‌ పట్టించుకోలేదు. అతనో రకం. తీవ్ర ఒత్తిడి ఉండే కీలకమైన మ్యాచ్‌ల్లో అతను అద్భుత ప్రదర్శన చేస్తాడు. అది 2015 ప్రపంచకప్‌ ఫైనల్‌ కావొచ్చు, 2023 ప్రపంచకప్‌ తుదిపోరు కావొచ్చు, ఇప్పుడు ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ కావొచ్చు. ఇలా పెద్ద మ్యాచ్‌ల్లో అదరగొట్టడం అతనికలవాటే. తొలి క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్‌ (Sunrisers Hyderabad) ను 3 వికెట్లతో దెబ్బకొట్టాడు. ఇప్పుడు ఫైనల్లోనూ కీలకమైన అభిషేక్, త్రిపాఠిల వికెట్లు తీసి సన్‌రైజర్స్‌కు చెక్‌పెట్టాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని