IPL 2023: ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌.. మూడు బెర్తులు.. నాలుగు టీమ్‌ల నుంచి తీవ్ర పోటీ!

ఐపీఎల్ 2023 సీజన్‌లో (IPL 2023) చివరి మ్యాచ్‌ ముగిసే వరకూ ప్లేఆఫ్స్‌ రేసు తేలేలా లేదు. తొలి స్థానం మినహా.. మిగతా వాటి కోసం ఏడు జట్లు పోటీ పడుతున్నప్పటికీ.. మరీ ముఖ్యంగా నాలుగు టీమ్‌లే ముందు వరుసులో ఉన్నాయి. 

Updated : 18 May 2023 17:56 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో (IPL 2023) ప్లేఆఫ్స్‌ రేసు ఉత్కంఠగా సాగుతోంది. గుజరాత్‌ ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది. మిగిలిన మూడు స్థానాల కోసం సాంకేతికంగా ఏడు టీమ్‌లు రేసులో ఉన్నాయి. వీటిల్లో చెన్నై సూపర్ కింగ్స్‌, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్‌ ముందంజలోఉన్నాయి. 

* ప్రస్తుతం గుజరాత్‌ టైటాన్స్‌ (18 పాయింట్లు) అగ్రస్థానంతో ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకున్న తొలి జట్టుగా అవతరించింది. తన చివరి మ్యాచ్‌లో బెంగళూరుతో తలపడాల్సి ఉంది. ఇందులో ఓడినా గుజరాత్‌ మొదటి స్థానానికి వచ్చిన నష్టమేం లేదు. 

* చెన్నై సూపర్‌ కింగ్స్‌ (15 పాయింట్లు) కూడా తన చివరి మ్యాచ్‌లో దిల్లీని ఓడిస్తే రెండో స్థానంతో ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లే అవకాశం ఉంది. మంచి నెట్‌రన్‌రేట్‌తో గెలిస్తే ఎటువంటి సమస్యా ఉండదు. అప్పుడు క్వాలిఫయర్స్‌లో ఆడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధార పడి ఉంటుంది.

* ప్రస్తుతం లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ 15 పాయింట్లతో చెన్నై కంటే తక్కువ నెట్‌రన్‌రేట్‌తో మూడో స్థానంలో కొనసాగుతోంది. లఖ్‌నవూ తన ఆఖరి మ్యాచ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఇందులో విజయం సాధిస్తే 17 పాయింట్లతో లఖ్‌నవూ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. రన్‌రేట్‌ బాగుంటే రెండులోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు తొలి క్వాలిఫయర్‌లో తన సోదరుడితోనే (గుజరాత్ టైటాన్స్‌) తలపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ రన్‌రేట్‌ తగ్గినా మూడో స్థానం మాత్రం ఖాయమవుతుంది. 

* ముంబయి ఇండియన్స్‌ (14 పాయింట్లు) కూడా తన చివరి మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ఓడించినా ప్లేఆఫ్స్‌లోకి వెళ్తుందని కచ్చితంగా చెప్పలేం. అప్పుడు ముంబయి 16 పాయింట్లతో లీగ్‌ స్టేజ్‌ను ముగిస్తుంది. దీనికి కారణం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. ఒకవేళ నేడు హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడితే మాత్రం ముంబయిదే నాలుగోప్లేఆఫ్స్‌ బెర్తు. నేడు ఎస్‌ఆర్‌హెచ్‌ మీద బెంగళూరు గెలిచి.. తన చివరి మ్యాచ్‌లో గుజరాత్‌ చేతిలో ఓడిపోతే మాత్రం ప్లేఆఫ్స్‌ మరింత ఆసక్తికరంగా మారుతుంది. మరోవైపు ముంబయి కూడా తన ఆఖరి మ్యాచ్‌లో ఓడితే నెట్‌రన్‌రేట్‌ కీలకంకానుంది. రాజస్థాన్‌ (12 పాయింట్లు), పంజాబ్‌ (12 పాయింట్లు), కోల్‌కతా (12 పాయింట్లు) కూడా తమ చివరి మ్యాచుల్లో గెలిచి.. ఇతర జట్లు ఓడిపోతేనే ప్లేఆఫ్స్‌ రేసులో నిలుస్తాయి. కానీ, అలాంటి ఛాన్స్‌లు చాలా తక్కువే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు