IND vs SA: దక్షిణాఫ్రికా పర్యటనకు భారత్‌.. మూడు ఫార్మాట్లకు ముగ్గురు సారథులు

దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టును (IND vs SA) బీసీసీఐ ప్రకటించింది. మూడు ఫార్మాట్లకు ముగ్గురిని సారథులుగా నియమించింది.

Updated : 07 Dec 2023 12:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌: డిసెంబర్‌ 10 నుంచి భారత్‌ జట్టు దక్షిణాఫ్రికాలో (IND vs SA) పర్యటించనుంది. వన్డే ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత టీమ్‌ ఇండియా చేపట్టనున్న తొలి విదేశీ పర్యటన ఇదే. దీనిలో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆతిథ్య జట్టుతో ఆడనుంది. దీంతోపాటు రెండు టెస్ట్‌ల్లోనూ తలపడనుంది. రోహిత్ శర్మ టీ20 కెప్టెన్సీ చేపడతాడా? లేదా? అనే ఉత్కంఠకు ముగింపు లభించింది. పరిమిత ఓవర్ల సిరీస్‌లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. టెస్టు సిరీస్‌కు రోహిత్.. వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్‌.. టీ20లకు సూర్యకుమార్‌ యాదవ్‌ నాయకత్వ బాధ్యతలు చేపడతారు. మూడు ఫార్మాట్లకు ముగ్గురిని కెప్టెన్లుగా నియమించడం గమనార్హం.

జట్లు ఇవే: 

టీ20లకు: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకు  సింగ్, శ్రేయస్‌ అయ్యర్, జితేశ్‌ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్‌ కెప్టెన్‌), వాషింగ్టన్‌ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్‌, ముకేశ్‌ కుమార్, దీపక్ చాహర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌

వన్డేలకు: రుతురాజ్‌ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్‌ వర్మ, రజత్ పటీదార్, రింకు సింగ్, శ్రేయస్‌ అయ్యర్, కేఎల్ రాహల్ (కెప్టెన్/వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్‌ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్‌ సుందర్, కుల్‌దీప్‌ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ముకేశ్ కుమార్‌, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్‌ సింగ్‌, దీపక్‌ చాహర్

టెస్టులకు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్, రుతురాజ్‌ గైక్వాడ్, ఇషాన్‌ కిషన్ (వికెట్ కీపర్‌), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్, సిరాజ్‌, షమీ (ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటే), బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), ప్రసిధ్ కృష్ణ

భారత్‌-దక్షిణాఫ్రికా సిరీస్‌ ఇలా..

డిసెంబర్‌ 10న తొలి టీ20

డిసెంబర్‌ 12 న రెండో టీ20

డిసెంబర్‌ 14న మూడో టీ20

డిసెంబర్‌ 17న తొలి వన్డే

డిసెంబర్‌ 19న రెండో వన్డే

డిసెంబర్‌ 21న మూడో వన్డే

డిసెంబర్‌ 26 నుంచి డిసెంబర్‌ 30 వరకు తొలి టెస్టు

జనవరి 3 నుంచి జనవరి 7 వరకు రెండో టెస్టు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని