Jasprit Bumrah: బుమ్రా అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా (Team India) ఇంగ్లండ్ టూర్ ఐపీఎల్ (IpL) ముగిసిన అనంతరం జూన్ 20న ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా భారత్ అయిదు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో బుమ్రా (Jasprit Bumrah) అతడి ఫిట్‌నెస్ సమస్యలు, వర్క్‌లోడ్ కారణంగా అన్ని మ్యాచులూ ఆడలేడని బీసీసీఐ చీఫ్ కోచ్ అజిత్ అగార్కర్ తెలిపాడు.
‘భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్‌తో జరగనున్న అన్ని మ్యాచ్‌లను ఆడగలిగే స్థితిలో లేడని ఫిజియోథెరపిస్టులు చెప్పారు. దీంతో అతడు కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాడు’ అని అజిత్ అగార్కర్ అన్నాడు. అలాగే శుభ్‌మన్ గిల్‌కు (Shubman Gill) టెస్టు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం గురించి కూడా మాట్లాడాడు. ‘మేం గత సంవత్సరం నుంచి శుభ్‌మన్ గిల్‌ను పరిశీలిస్తున్నాం. మా అంచనా ప్రకారం అతడు టీమ్‌ను అద్భుతంగా లీడ్ చేయగలడు. టీమ్‌ఇండియాకు కెప్టెన్ అంటే చాలా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అయినా వాటిని తట్టుకుని రాణిస్తాడనే నమ్మకం మాకుంది’ అని అజిత్ అగార్కర్ మీడియాతో అన్నాడు.
భారతజట్టులో స్థానం దక్కని మహ్మద్ షమీ (Mohammed Shami) విషయాన్ని కూడా ప్రస్తావించాడు. ‘జట్టు అవసరాలు తీర్చగలిగేంత పూర్తి ఫిట్‌నెస్‌తో షమీ లేడు. ఇంగ్లండ్ టూర్‌కు అతడు అందుబాటులో ఉంటాడని మేం అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదు’ అని అజిత్ అగార్కర్ ముగించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అబుధాబి లక్కీ డ్రాలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 - 
                        
                            

చేవెళ్ల బస్సు దుర్ఘటనకు అదీ ఒక కారణమే: మంత్రి పొన్నం
 


