ChatGPT: ధోనీకి హెలికాప్టర్‌.. మరి రోహిత్‌, కోహ్లీ, సూర్య, జడేజా, పాండ్యకు ఏంటి?

మహేంద్ర సింగ్‌ ధోనీ అనగానే మనకు గుర్తొచ్చే అంశాల్లో హెలికాప్టర్ షాట్‌ ఒకటి. అలా మన స్టార్‌ క్రికెటర్ల విషయంలో అంత స్పెషల్‌గా నిలిచన షాట్లేంటో తెలుసా? (Best Shot of Team India Star Players)

Updated : 18 Jul 2023 14:05 IST

మన స్టార్‌ క్రికెటర్లు మైదానంలోకి దిగి షాట్లు కొడుతుంటే చాలా ఎంజాయ్‌ చేస్తాం. ఆయా క్రికెటర్ల అభిమానిని అడిగితే.. వాళ్లు అడే ప్రతి షాట్‌ బెస్ట్‌ అని చెబుతారు. అయితే ఈ విషయంలో చాట్‌జీపీటీ (ChatGPT) ఏం చెప్పిందో తెలుసా? ఒక్కో ఆటగాడి గురించి వివరిస్తూ.. వాళ్ల బెస్ట్‌ షాట్‌ ఏది అనే విషయాలు చెప్పింది. ఆ వివరాలు మీ కోసం..

రోహిత్‌ టైమింగ్‌+ పవర్‌

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) నుంచి మొదలుపెడదాం. టైమింగ్‌తో పవర్‌ ఫుల్‌ షాట్లు కొట్టడంలో రోహిత్‌ స్టైలే వేరు. షార్ట్‌ పిచ్‌ బంతి స్లాట్‌లో పడిందంటే చాలు... సిక్సర్‌ను మంచి నీళ్లు తాగినట్లు కొట్టేస్తాడు. దీనికి ఎక్కువగా రోహిత్‌ ఎంచుకునేది పుల్‌ షాట్. చాట్‌ జీపీటీ కూడా ఇదే మాట చెప్పింది. ఫార్మాట్‌ ఏదైనా హిట్‌ మ్యాన్‌కు ఈ షాట్‌ బెస్ట్‌ అంటోంది.

కూల్‌గా డ్రైవ్‌ కొట్టే కోహ్లీ

టీమ్‌ ఇండియా కింగ్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli)కి బెస్ట్‌ షాట్ ఏది అని చాట్‌జీపీటీని అడిగితే... చాలా కూల్‌గా ‘కవర్‌ డ్రైవ్‌’ కొట్టేలా ఆన్సర్‌ ఇచ్చింది. బాడీ బ్యాలెన్స్‌, టైమింగ్‌ను నమ్ముకుని షాట్లు కొట్టే.. విరాట్‌ కవర్‌ డ్రైవ్‌ కొడితే మాత్రం కళ్లార్పకుండా చూడాలనిపిస్తుందని చాట్‌జీపీటీ అంటోంది. ఫీల్డర్ల మధ్య గ్యాప్‌ను పసిగట్టి బంతిని పంపడంలో కింగ్‌ టాలెంట్‌ తెలుస్తుంది అని వివరించింది. దీంట్లో అతని ఫుట్‌వర్క్‌ గొప్పతనం కూడా ఉందని చెప్పింది. 

కుంగ్‌ ఫు పాండ్యా షాట్‌

భారత క్రికెట్‌లో ధోనీకి శిష్యులు చాలామంది ఉన్నారు. అయితే అందులో ధోనీ ఫేవరెట్‌ షాట్‌ అయిన హెలికాప్టర్‌ను కొనసాగిస్తున్నది మాత్రం హార్దిక్‌ పాండ్య (Hardik Pandya)నే. అంతేకాదు ఇదే అతని బెస్ట్‌ షాట్‌ అని చాట్‌జీపీటీ చెబుతోంది. టీ20లకు టీమ్‌ ఇండియా కెప్టెన్‌ అయిన పాండ్యను అభిమానులు కుంగ్‌ఫు పాండ్య అంటుంటారు. అచ్చంగా అలాంటి స్టైల్‌లోనే ధోనీ హెలికాప్టర్‌ను కాస్త ఇంప్రూవైజ్‌ చేసి కొడుతుంటాడు. 

మన 360.. మన సూర్య

ఆధునిక తరం క్రికెటర్లలో మిస్టర్‌ 360 అంటే ఠక్కున గుర్తొచ్చే ఏకైక పేరు సూర్య కుమార్‌ యాదవ్‌ (Surya Kumar Yadav). అనతికాలంలో స్టార్‌ టీ20 ప్లేయర్‌ అయిపోయిన స్కైకి ఫేవరెట్‌ అండ్‌ బెస్ట్‌ షాట్‌ అంటే... కవర్‌ డ్రైవ్‌ అని చాట్‌జీపీటీ చెబుతోంది. అయితే దాంతోపాటు ఫాస్ట్‌ బౌలర్లు అని కూడా చూడకుండా సూర్య ఆడే ఫుల్ షాట్లు అన్నా అభిమానులు అంతే ఎంజాయ్‌ చేస్తుంటారు. 

జడేజా జాదూ స్పెషల్

టీమ్‌ ఇండియాలో బెస్ట్‌ ఆల్‌రౌండర్‌ అంటూ లిస్ట్‌ రాస్తే అందులో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) టాప్‌లో నిలవడం ఖాయం. అంతలా ఇటీవల కాలంలో అదరగొడుతున్నాడు మరి. అలాంటి జడ్డూకి బెస్ట్‌ షాట్‌ ఏది? అని అడిగితే చాట్‌జీపీటీ స్ట్రైట్‌గా స్ట్రయిట్‌ డ్రైవ్‌ అని చెప్పేసింది. లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాటర్లు ఈ షాట్‌ ఆడితే అందంగా ఉంటుంది. అయితే జడేజా ఆడితే జాదూ చేసినట్లుగా ఉంటుంది అని ఫ్యాన్స్‌ అంటుంటారు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని