T20 World Cup: రక్షకుడు బుమ్రా

ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో భారత్‌ గెలిచిందంటే బుమ్రానే కారణం. కీలక మ్యాచ్‌ల్లో ఎప్పుడైనా వికెట్‌ అత్యావశ్యకం అయినపుడు భారత్‌ చూసేది అతడి వైపే.

Published : 10 Jun 2024 04:34 IST

టమి తప్పదనుకున్న మ్యాచ్‌లో భారత్‌ గెలిచిందంటే బుమ్రానే కారణం. కీలక మ్యాచ్‌ల్లో ఎప్పుడైనా వికెట్‌ అత్యావశ్యకం అయినపుడు భారత్‌ చూసేది అతడి వైపే. మిగతా బౌలర్లు పరుగులు కట్టడి చేయలేక, వికెట్లు పడగొట్టలేక మ్యాచ్‌ చేజారేలా కనిపిస్తున్న తరుణంలో అతను ప్రమాదకర రిజ్వాన్‌ను బౌల్డ్‌ చేసిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. తక్కువ ఎత్తులో దూసుకొచ్చిన బంతిని రిజ్వాన్‌ స్వీప్‌ చేయాలని చూడగా.. అది అతడికి చిక్కకుండా వెళ్లి ఆఫ్‌ స్టంప్‌ను లేపేసింది. అంతకుముందు కీలకమైన బాబర్‌ అజామ్‌నూ బుమ్రానే పెవిలియన్‌ చేర్చాడు. మొత్తంగా అతను 4 ఓవర్లలో 14 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని