CSK: తిరుగులేని చెన్నై.. పన్నెండోసారీ ప్లేఆఫ్స్‌లోకి!
ఐపీఎల్‌లో (IPL) అత్యంత విజయవంతమైన జట్టు ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK). నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన సీఎస్‌కే.. మరోసారి ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ మరో రికార్డు సృష్టించింది. మెగా టోర్నీలో అత్యధిక సార్లు ప్లేఆఫ్స్‌కు చేరిన జట్టుగా ఇప్పటికే రికార్డుకెక్కిన చెన్నై.. ఆ సంఖ్యను మరింత పెంచుకుంది. తాజాగా దిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి మరీ చెన్నై (CSK) ప్లేఆఫ్స్‌ను బెర్తును ఖరారు చేసుకుంది. దీంతో మొత్తం 16 సీజన్లలో 12 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరిన ఏకైక జట్టు సీఎస్‌కే. ఆ తర్వాత ముంబయి (ఈ సీజన్‌లో కాకుండా) 9 సార్లు చేరుకుంది. రెండు సీజన్లలో సీఎస్‌కేపై నిషేధం పడిన సంగతి తెలిసిందే. మరో రెండుసార్లు మాత్రమే లీగ్ స్టేజ్‌కు పరిమితమైంది. ఇప్పటి వరకు నాలుగు టైటిళ్లను సీఎస్‌కే తన ఖాతాలో వేసుకుంది. మరి ఏ సీజన్‌లో ఎలా అనేది ఓసారి చూద్దాం..
- 2008: ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే, అక్కడ రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడింది. దీంతో రన్నరప్‌గా నిలిచింది.
- 2009: సెమీఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో చెన్నై ఓడిపోయింది. దీంతో ఫైనల్‌కు చేరి కప్‌ను సాధిద్దామనే కల నెరవేరలేదు.
- 2010: వరుసగా రెండు సీజన్లలో అదరగొట్టిన సీఎస్‌కే మూడోసారి విజేతగా నిలిచింది. ఈ సీజన్ ఫైనల్‌లో ముంబయిని ఓడించి ఛాంపియన్‌గా అవతరించింది.
- 2011: డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నై ఈసారి కూడా అదరగొట్టేసి విజేతగా నిలిచింది. ఫైనల్‌లో బెంగళూరును ఓడించి వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా చెన్నై అవతరించింది.
- 2012: హ్యాట్రిక్ ఛాంపియన్‌గా నిలుద్దామనే ఆశలకు బ్రేక్ పడింది. ఫైనల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓడిపోయింది.
- 2013: ఈసారి కూడా రన్నరప్‌గానే టోర్నీని ముగించింది. ఫైనల్‌కు చేరిన చెన్నై.. ముంబయి ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది.
- 2014: ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరిన చెన్నై మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండో క్వాలిఫయర్‌లో పంజాబ్ చేతిలో ఓడింది. కానీ, అదే ఏడాదిలో జరిగిన ఛాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీ విజేతగా నిలిచింది.
- 2015: మరోసారి రన్నరప్‌గానే టోర్నీని ముగించింది. ఫైనల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. దీంతో అత్యధిక సార్లు ప్లేఆఫ్స్‌కు చేరిన జట్టుగా చెన్నై రికార్డు సృష్టించింది.
- 2018: వరుసగా రెండు సీజన్లలో (2016, 2017) నిషేధానికి గురైన చెన్నై... మళ్లీ పునరాగమనం చేసిన సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది.
- 2019: ఈ సీజన్‌లోనూ చెన్నై మళ్లీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే, ఫైనల్‌లో ఒక్క పరుగు తేడాతో ముంబయి చేతిలో ఓడిపోయి కప్‌ను చేజార్చుకుంది.
- 2021: అంతకుముందు ఏడాది (2020 సీజన్)లో లీగ్ స్టేజ్‌కే పరిమితమైన చెన్నై పుంజుకుంది. ఫైనల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసి మరీ నాలుగోసారి ధోనీసేన టైటిల్‌ను సొంతం చేసుకుంది.
- 2023: గతేడాది పేలవ ప్రదర్శనతో విమర్శలపాలైన చెన్నై.. ఈసారి మాత్రం అదరగొట్టింది. ధోనీకి చివరి సీజన్‌గా భావిస్తున్న సమయంలో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Hyderabad: సరూర్‌నగర్‌లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్.. రుచులను ఆస్వాదించిన నేతలు
-
Sports News
WTC Final: అజింక్య రహానె స్వేచ్ఛగా ఆడేస్తాడు..: సంజయ్ మంజ్రేకర్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
Delhi liquor case: మాగుంట రాఘవ్‌కు బెయిల్.. సుప్రీంకు ఈడీ
-
India News
Mansoon: చల్లని కబురు.. నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్..
-
Sports News
WTC Final: అప్పటికే భారత ఆటగాళ్లలో అలసట కనిపించింది: సునీల్ గావస్కర్