ఆర్జనలో రొనాల్డో నం.1

ఫోర్బ్స్‌ అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు.

Published : 18 May 2024 03:36 IST

లండన్‌: ఫోర్బ్స్‌ అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. గత పన్నెండు నెలల కాలంలో అత్యధికంగా ఆదాయాన్ని పొందుతున్న వారిలో రూ.21 వేల కోట్లతో అతడు నంబర్‌వన్‌ ర్యాంకు సాధించాడు. 2023లో రూ.11 వేల కోట్లతో ఉన్న రొనాల్డో.. సౌదీ అల్‌ నాసర్‌ క్లబ్‌తో రూ.16 వేల కోట్లకు భారీ ఒప్పందం చేసుకుని ఆదాయాన్ని గణనీయంగా పెంచుకున్నాడు. నైకీ, హెర్బాలైఫ్‌ తదితర బ్రాండ్‌ల ద్వారా మరో రూ.500 కోట్లు సంపాదిస్తున్నాడు. ఫోర్బ్స్‌ జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకోవడం కెరీర్‌లో రొనాల్డోకిది నాలుగోసారి. జాన్‌ రహామ్‌ (స్పెయిన్, రూ.18 వేల కోట్లు), అర్జెంటీనా స్టార్‌ లియెనల్‌ మెస్సి (రూ.11 వేల కోట్లు) రెండు, మూడో స్థానాల్లో కొనసాగుతున్నారు. మెస్సి ఆట ద్వారా రూ.500 కోట్లు, వ్యాపార ప్రకటనల ద్వారా మరో రూ.580 కోట్లు లభిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని