IPL: ‘కోహ్లీ కోహ్లీ’ అంటూ అభిమానుల నినాదాలు.. నవీనుల్ హక్ ఏం చేశాడంటే?
లఖ్‌నవూ, ముంబయి మధ్య జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ ఆటగాడు నవీనుల్ హక్ (Naveen-ul-Haq)ని చూస్తూ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఫ్యాన్స్.. ‘కోహ్లీ కోహ్లీ’ అని నినాదాలు చేశారు. దీనికి నవీనుల్ హక్ ఏ విధంగా రియాక్షన్ ఇచ్చాడంటే..
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల లఖ్‌నవూ, బెంగళూరు జట్ల మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి.. లఖ్‌నవూ ఆటగాడు నవీనుల్ హక్ (Naveen ul Haq), మెంటార్ గంభీర్‌లకు మధ్య ఎంత పెద్ద గొడవ జరిగిందో తెలిసిందే. కోహ్లీ తన షూను చూపిస్తూ తిట్టడంతో నవీనుల్‌కు ఆగ్రహం తెప్పించింది. మ్యాచ్ అనంతరం కోహ్లీతో అతను గొడవ పడ్డాడు. అంతటితో వివాదం సద్దుమణగలేదు. మరుసటి రోజు కోహ్లీ, నవీనుల్ సామాజిక మాధ్యమాల్లో స్టేటస్‌ల రూపంలో గొడవ కొనసాగింది. ఒకరి మీద ఒకరు పరోక్షంగా విమర్శలు గుప్పించుకున్నారు.
ముంబయితో మ్యాచ్‌లో కోహ్లీ ఒక్క పరుగే చేసి ఔటైనప్పుడు నవీనుల్ హక్ తాను మ్యాచ్‌ను వీక్షిస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ‘‘తియ్యనైన మామిడి పండ్లు’’ అని క్యాప్షన్ జోడించాడు. కోహ్లీ ఔట్ కావడంతో సంబరం చేసుకున్నట్టుగా అనిపించేలా నవీనుల్ హక్ ఆ పోస్టు పెట్టాడని నెట్టింట చర్చ జరిగింది. నవీనుల్ హక్‌ను విమర్శిస్తూ కోహ్లీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అంతేకాదు మంగళవారం ముంబయి, లఖ్‌నవూ మధ్య జరిగిన మ్యాచ్‌లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న నవీనుల్ హక్‌ను చూస్తూ ‘కోహ్లీ కోహ్లీ’ అని నినాదాలు చేశారు. ఆ నినాదాలను విన్న నవీనుల్ హక్.. ఇంకా బిగ్గరగా అరవండి అంటూ సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పామును కొరికి చంపిన బాలుడు
-
Sports News
చిరునవ్వుతో టాటా.. పీఎస్జీని వీడిన మెస్సి
-
India News
అనాథకు.. తండ్రిని చూపిన అన్నదానం
-
Ts-top-news News
ప్రొటోకాల్ వివాదం.. శిలాఫలకాల తొలగింపు
-
Ts-top-news News
ప్రశ్నపత్రాల లీకేజీలో త్వరలో మూకుమ్మడి అరెస్టులు
-
Ts-top-news News
నిరుటి కంటే ముందే అన్నదాతకు రైతుబంధు!