MS Dhoni: 2025లో ధోని ఆడతాడనే..

మహేంద్రసింగ్‌ ధోని ఈ సీజన్‌తోనే ఐపీఎల్‌ కెరీర్‌ను ముగిస్తాడని జోరుగా ప్రచారం జరిగింది. కానీ డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నై ప్లేఆఫ్స్‌ చేరకుండానే లీగ్‌ నుంచి నిష్క్రమించగా..

Published : 24 May 2024 04:16 IST

చెన్నై: మహేంద్రసింగ్‌ ధోని ఈ సీజన్‌తోనే ఐపీఎల్‌ కెరీర్‌ను ముగిస్తాడని జోరుగా ప్రచారం జరిగింది. కానీ డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నై ప్లేఆఫ్స్‌ చేరకుండానే లీగ్‌ నుంచి నిష్క్రమించగా.. చివరి మ్యాచ్‌లో మహి ఎలాంటి ప్రకటనా చేయకుండా మౌనంగానే ఉండిపోయాడు. దీంతో ధోని ఇంకో సీజన్‌ ఆడతాడేమో అన్న ఆశలు రేగాయి అభిమానుల్లో. ఆ ఆశలకు ఊతమిచ్చేలాగే మాట్లాడుతున్నాడు చెన్నై సూపర్‌కింగ్స్‌ సీఈవో కాశీ విశ్వనాథ్‌. ధోని ఇంకో సీజన్‌ ఆడతాడా అని అడిగితే.. ‘‘ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఆ ప్రశ్నకు ధోనీనే సమాధానం ఇవ్వాలి. అతనే నిర్ణయం తీసుకున్నా మేం గౌరవిస్తాం. ఏదైనా తనకే వదిలేశాం. ధోని ఏదైనా నిర్ణయం తీసుకుంటే సరైన సమయం చూసి వెల్లడిస్తాడని మనందరికీ తెలుసు. అయితే మహి సీఎస్‌కే తరఫున ఇంకో సీజన్‌ ఆడతాడనే  ఆశాభావంతోనే ఉన్నాం. అభిమానులతో పాటు నాదీ అదే ఆశ’’ అని కాశీ విశ్వనాథ్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని