IPL 2023:చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. కీలక ఆటగాడు దూరం!
ఐపీఎల్-16 సీజన్ ప్రారంభంకాకముందే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కు వరుస షాక్‌లు తగులుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్-16 (IPL) సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభంకానుంది. ఇప్పటికే చాలామంది ఆటగాళ్లు తమ తమ ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన క్యాంపుల్లోకి చేరి సాధన మొదలెట్టారు. అయితే, గతేడాది పేలవ ఆటతీరుతో పాయింట్ల పట్టికలో దిగువ నుంచి రెండో స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు ఈ సారి టోర్నీ ఆరంభం కాకముందే షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. వెన్ను గాయం కారణంగా ఇప్పటికే న్యూజిలాండ్ పేసర్ కైల్ జెమీసన్ సేవలను కోల్పోయిన సీఎస్కేకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
గతేడాది అదరగొట్టిన ఫాస్ట్‌బౌలర్ ముఖేశ్ చౌదరి (Mukesh Choudhary) కూడా ఐపీఎల్-16కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. వెన్ను గాయంతో బాధపడుతున్న అతడు.. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. ముఖేశ్ చౌదరి గాయం నుంచి ఎప్పటివరకు పూర్తిస్థాయిలో కోలుకుంటాడనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. గతేడాది ఐపీఎల్ అరంగేట్రం చేసిన ముఖేష్.. దీపక్ చాహర్ లేని లోటును భర్తీ చేశాడు. 13 మ్యాచ్‌లు ఆడి 16 వికెట్లు సాధించాడు. ఇందులో 11 వికెట్లు పవర్ ప్లేలో పడగొట్టినవే.
సీఎస్కే ఆటగాళ్లు దీపక్ చాహర్, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబెలు గాయాల నుంచి కోలుకుంటున్నారు. న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌ల కారణంగా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు మహేశ్ తీక్షణ, మతీశా పతిరాణా కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నారు. మార్చి 31న చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌తో ఈ సీజన్ ప్రారంభంకానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
నయన చిత్రం.. ప్రతీకార నేపథ్యం
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
World News
భారతీయులకు వీసాల మంజూరులో జాప్యమేల?
-
Crime News
ప్రియుడి మర్మాంగం కోసిన యువతి
-
Ts-top-news News
భారత్‌లో మహిళలకు బైపాస్ సర్జరీ అనంతర ముప్పు తక్కువే!