T20 World Cup 2024: నెదర్లాండ్స్‌పై దక్షిణాఫ్రికా విజయం

టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌-డి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌పై కష్టపడి గెలిచింది. శనివారం మొదట బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌ 9 వికెట్లకు 103 పరుగులే చేయగలిగింది.

Updated : 09 Jun 2024 04:11 IST

న్యూయార్క్‌: టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌-డి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌పై కష్టపడి గెలిచింది. శనివారం మొదట బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌ 9 వికెట్లకు 103 పరుగులే చేయగలిగింది. సిబ్రాండ్‌ (40) టాప్‌ స్కోరర్‌. డచ్‌ జట్టు తక్కువ లక్ష్యాన్నే నిర్దేశించినా.. దక్షిణాఫ్రికాకు చెమటలు పట్టించింది. ఛేదనలో దక్షిణాఫ్రికా ఓ దశలో 12 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. ఆ దశలో మిల్లర్‌ (59 నాటౌట్‌; 51 బంతుల్లో 3×4, 4×6) జట్టును ఆదుకున్నాడు. స్టబ్స్‌ (33)తో అయిదో వికెట్‌కు 65 పరుగులు జోడించాడు. స్టబ్స్‌ తర్వాత యాన్సెన్‌ (3) కూడా ఔటైనా.. కేశవ్‌ మహరాజ్‌తో కలిసి మిల్లర్‌ పని పూర్తి చేశాడు. దక్షిణాఫ్రికా 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని