warner: నా కుటుంబాన్ని బలి చేయలేను.. నిషేధంపై సమీక్షను విరమించుకుంటున్నా: వార్నర్
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుపై డేవిడ్(David warner) వార్నర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
కాన్‌బెరా: కెప్టెన్సీ చేపట్టకుండా ఆస్ట్రేలియా(Australia) ఓపెనర్ డేవిడ్ వార్నర్(David warner)పై జీవితకాల నిషేధం(Ban) ఉన్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై సమీక్ష కోరుతూ వార్నర్ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నాడు. తాజాగా తన దరఖాస్తును విరమించుకుంటున్నట్టుగా వార్నర్ బుధవారం ప్రకటించాడు. ఈ సందర్భంగా బోర్డు స్వతంత్ర ప్యానెల్, కౌన్సిల్ సహాయక సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
‘‘నాకు క్రికెట్ కన్నా నా కుటుంబమే ముఖ్యం. కేప్‌టౌన్‌లో మూడో టెస్టు సంఘటన తర్వాత దాదాపు ఐదేళ్లుగా ఎన్నో అవమానాలను నాతో పాటు నా కుటుంబం ఎదర్కోవలసి వచ్చింది. నాపై నిషేధం ఉన్నప్పటికీ ఆరోజు నుంచి నన్ను నేను ఆట పరంగా సంస్కరించుకోవడానికి కృషి చేశాను. క్రికెట్‌కు నా సేవలు అందించాను. అయినా, నేను అనుభవిస్తున్న శిక్ష నుండి ఇప్పటికీ విముక్తి పొందలేకపోతున్నాను. గత నవంబర్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ ప్రవర్తనా నియమావళిని సవరించింది. అది నాలో కొత్త ఆశలను రేకెత్తించింది. నాపై ఉన్న నిషేధంపై సమీక్షను కోరేందుకు ఒక అవకాశం లభించిందని అనుకున్నాను. కానీ, ఇటీవల ఈ విషయంలో కౌన్సిల్ న్యాయవాది నాపైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. 2018 న్యూజిలాండ్ పర్యటన సమయంలో అసలేం జరిగిందనే విషయంపై వారు బహిరంగ ప్రదర్శన ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ప్యానెల్ మాటల్లో చెప్పాలంటే వారు క్రికెట్‌ను ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు. ఆ సంఘటనపై పబ్లిక్ ట్రయల్ నిర్వహించాలని ప్యానెల్ నిర్ణయించింది. అయితే దీని వల్ల నా కుటుంబం సభ్యులు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆ చెత్త ఎపిసోడ్‌ను క్లీన్ చేసేందుకు వాషింగ్ మెషీన్‌లా నేను సిద్ధంగా లేను’’ అని వార్నర్ సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేశాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం