
David Warner: డేవిడ్ వార్నర్.. ఇది కదా స్వీట్ రివెంజ్..!
హైదరాబాద్‌పై విధ్వంసం.. బ్యాట్‌తోనే సమాధానం..
‘‘ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం కొందరికే అలవాటు. అలా ఒదిగి ఉండటం కూడా అంత తేలికేం కాదు.’’ ఇప్పుడు ఈ సామెత దిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు సరిగ్గా సరిపోతుంది. కేవలం ఒక్క సీజన్లో విఫలమైనంత మాత్రాన ఘోర అవమానంతో బయటకు గెంటేసిన హైదరాబాద్ జట్టుకు ఇప్పుడు తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. కనీసం కారణం కూడా చెప్పకుండా వదిలేసిన జట్టుపై.. వీసమెత్తు మాట తూలకుండా తానేంటో, తన విలువేంటో ఆటతోనే తేల్చి చెప్పాడు. దీంతో ఈ దిల్లీ ఓపెనర్ హైదరబాద్ జట్టుపై స్వీట్ రివెంజ్ తీసుకున్నాడు.
దిల్లీతో మొదలెట్టి.. హైదరాబాద్‌తో పేరు సంపాదించి..
డేవిడ్ వార్నర్ భారత టీ20 లీగ్‌లో చెరగని ముద్రవేశాడు. 2009లో దిల్లీ జట్టుతోనే ఈ టోర్నీలో ప్రయాణం మొదలెట్టాడు. 2013 వరకూ ఐదేళ్లు ఇక్కడే ఆడినా అప్పుడప్పుడు మెరుపులు మెరిపించించడమే తప్ప పెద్దగా పేరు సంపాదించలేదు. కానీ, 2014లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించడం మొదలుపెట్టాక అతడి గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఒకవైపు సారథిగా జట్టును ముందుండి నడిపిస్తూనే మరోవైపు బ్యాట్స్‌మన్‌గా పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలోనే 2016లో అప్పటి బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ (973)తో పోటీపడి మరీ పరుగులు సాధించాడు. ఆ సీజన్లో వార్నర్ తొమ్మిది అర్ధశతకాలతో మొత్తం (848) పరుగులు దంచికొట్టాడు. మరోవైపు బెంగళూరుతోనే తలపడిన ఫైనల్లోనూ ధనాధన్ బ్యాటింగ్‌తో హైదరాబాద్‌కు కప్పు అందించాడు. దీంతో ఆ జట్టును వరుసగా ఐదేళ్లు ప్లేఆఫ్స్ వరకూ తీసుకెళ్లి ఘన చరిత్ర సృష్టించాడు.
కోహ్లీ, రోహిత్ కన్నా మేటి..
ఇక ఈ టీ20 టోర్నీలో బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ (6,499), పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధావన్ (6,153), ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ (5,766) అత్యధిక పరుగుల వీరులుగా తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వారి తర్వాత వార్నర్ (5,762) పరుగులతో నాలుగో స్థానంలో నిలిచాడు. అయినా, సగటు, స్ట్రైక్‌రేట్, అర్ధశతకాల సంఖ్యల పరంగా చూస్తే వార్నరే మేటిగా ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ (36.51), ధావన్ (35.36), రోహిత్ (30.51) సగటుతో కొనసాగుతుండగా.. వార్నర్ (42.06) ముగ్గురికన్నా గొప్పగా రాణిస్తున్నాడు. అలాగే స్రైక్రేట్లోనూ వార్నర్ (140.71).. కోహ్లీ (129.26), ధావన్ (126.53), రోహిత్ (130.19)ల కన్నా అద్భుతంగా దూసుకుపోతున్నాడు. ఇక శతకాలు, అర్ధ శతకాలతో పోల్చి చూసినా వార్నర్ 4 శతకాలు, 53 అర్ధశతకాలతో ముందున్నాడు. విరాట్ 5 శతకాలు, 43 అర్ధశతకాలతో ఉండగా, ధావన్ 2 సెంచరీలు, 47 హాఫ్ సెంచరీలు, రోహిత్ 1 శతకం, 40 అర్ధశతకాలతో ఉన్నారు. ఇలా ఏ విధంగా చూసినా వార్నర్ అద్భుతంగా రాణిస్తున్నాడు.
ఈ సీజన్లో ఎలా ఆడుతున్నాడంటే..
వార్నర్ ఎప్పటిలాగే ఈ సీజన్లోనూ అదరగొడుతున్నాడు. గతేడాది హైదరాబాద్ తరఫున ఆడిన 8 మ్యాచ్‌ల్లో రెండు అర్ధశతకాలతో 195 పరుగులే చేసిన అతడు ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో నాలుగు అర్ధశతకాలతో 356 పరుగులు చేశాడు. దీంతో ఈ సీజన్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో నాలుగో స్థానంలో దూసుకుపోతున్నాడు. అయితే, ఇక్కడ టాప్-10 బ్యాట్స్‌మెన్ అందరూ 9, 10 మ్యాచ్‌లు ఆడగా.. వార్నర్ 8 మ్యాచ్‌ల్లోనే టాప్‌లో ఒకడిగా నిలిచాడు. దీన్నిబట్టి అతడెలా రాణిస్తున్నాడో, అతడిని వదిలేసుకొని హైదరాబాద్ ఎంత పెద్ద తప్పు చేసిందో చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా గతరాత్రి ఆ జట్టుపైనే చెలరేగడం విశేషం. ఓపెనర్‌గా వచ్చిన వార్నర్ (92 నాటౌట్; 58 బంతుల్లో 13x4, 3x6) విధ్వంసం సృష్టించి ఈ సీజన్లో తన అత్యధిక స్కోర్ నమోదు చేయడమే కాకుండా హైదరాబాద్‌కు మ్యాచ్ దూరం చేయడంలోనూ అతడిదే కీలక పాత్ర. దీంతో దిల్లీ ఈ సీజన్లో ఐదో విజయం నమోదు చేసి పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. వార్నర్ మున్ముందు ఇలాగే ఆడితే ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసులోనూ దూసుకుపోయే అవకాశం ఉంది.
ఇందుకే వార్నర్ గ్రేట్ అనేది..
ఇక గతరాత్రి మ్యాచ్ గెలిచి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాక వార్నర్ మాట్లాడాడు. హైదరాబాద్‌పై ఇలా చెలరేగడానికి తనకేం అదనపు స్ఫూర్తి అవసరం లేదన్నాడు. దీన్నిబట్టి వార్నర్ ఎంత సహృదయుడో అర్థం చేసుకోవచ్చు. గతేడాది సీజన్ మధ్యలో హైదరాబాద్ తుది జట్టులో నుంచి తొలగించినా, తర్వాత కెప్టెన్సీ నుంచి పక్కనపెట్టినా.. వార్నర్ చాలా హూందాగా ప్రవర్తించాడు. సామాజిక మాధ్యమాల్లో ఆ జట్టుపై ఎన్ని విమర్శలొచ్చినా వార్నర్ ఒక్క మాట కూడా తూలలేదు. మనసులో ఎంత బాధ ఉన్నా పైకి నవ్వుతూనే కనిపించాడు. ముఖ్యంగా కొన్ని మ్యాచ్‌లకు గ్యాలరీలో నిల్చొని మరీ జట్టును ఉత్సాహపర్చాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అంటే ఇదేనేమో! అందుకే ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై అత్యధిక స్కోర్ సాధించినా చాలా నిష్కల్మషంగా కనిపించాడు. తన ఆటకు కట్టుబడి ఉంటే పరుగులు వాటంతట అవే వస్తాయనే ప్రాథమిక సూత్రాన్నే నమ్ముకొన్నాడు. ఎంతైనా తనని దూరం చేసుకున్న జట్టుపై ఈ బ్యాటింగ్ దిగ్గజం స్వీట్ రివెంజ్ తీర్చుకొన్నాడు.
- ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం..
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
WHO: మహమ్మారి మార్పు చెందుతోంది.. ముగిసిపోలేదు..!
-
Business News
Lenskart: ఆసియా మార్కెట్‌పై లెన్స్‌కార్ట్ కన్ను.. జపాన్ కంపెనీలో మెజార్టీ వాటా!
-
Movies News
Rocketry Preview: ప్రివ్యూ: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Nara Lokesh: అవన్నీ జగన్ నాటక రెడ్డి పాలనలోనే జరుగుతాయి: నారా లోకేశ్
-
General News
TS Tenth Results: తెలంగాణ ‘పది’ ఫలితాలు.. జిల్లాల వారీగా వివరాలివే..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- IND vs ENG: కథ మారింది..!
- బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్‌కు లేని ఇబ్బంది నాకెందుకు?
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
- Maharashtra Crisis: సీఎం పదవికి రాజీనామా
- Maharashtra: సీఎంగా ఫడణవీస్.. శిందేకు డిప్యూటీ సీఎం పదవి?
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!