WPL: ఉత్కంఠ పోరులో దిల్లీదే గెలుపు.. ఆర్సీబీకి ఐదో ఓటమి

డబ్ల్యూపీఎల్‌ (WPL)రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు మరో ఓటమి. పేలవ ఆటతీరుతో ఆర్సీబీ వరుసగా ఐదో ఓటమిని మూటగట్టుకుంది.

Updated : 13 Mar 2023 23:17 IST

ముంబయి: డబ్ల్యూపీఎల్‌ (WPL)రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు మరో ఓటమి. పేలవ ఆటతీరుతో ఆర్సీబీ వరుసగా ఐదో ఓటమిని మూటగట్టుకుంది. బెంగళూరుపై దిల్లీ క్యాపిటల్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని దిల్లీ 4 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో ఛేదించింది. దిల్లీ బ్యాటర్లలో క్యాప్సీ (38; 24 బంతుల్లో 8 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్‌ (32; 28 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. మరిజేన్ కాప్ (32; 32 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), జొనాసెన్ (29; 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) చివర్లో ధాటిగా ఆడారు. బెంగళూరు  బౌలర్లలో ఆశా శోభన రెండు, మేఘన్‌ స్కట్, ప్రీతి తలో వికెట్‌ పడగొట్టారు. చివరి ఓవర్లో దిల్లీ విజయానికి 6 బంతుల్లో 9 పరుగులు అవసరం అయ్యాయి. మొదటి రెండు బంతుల్లో రెండు పరుగులు రాగా.. మూడో బంతికి జొనాసెన్‌ సిక్సర్‌ బాదడంతో స్కోర్లు సమం అయ్యాయి. నాలుగో బంతికి ఫోర్‌ కొట్టడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు.

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ బ్యాటర్లలో ఎల్లీస్‌ పెర్రీ (67; 52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ శతకంతో మెరవగా.. రిచా ఘోష్‌ (37; 16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడింది. కెప్టెన్‌ స్మృతి మంధాన (8), హెథర్‌ నైట్‌ (11) నిరాశపర్చగా..  సోఫీ డివైన్‌ (21) ఫర్వాలేదనిపించింది. శ్రేయంకా పాటిల్‌ (4*)  పరుగులు చేసింది. దిల్లీ బౌలర్లలో శిఖా పాండే మూడు వికెట్లతో ఆకట్టుకోగా.. తారా నోరిస్ ఒక వికెట్‌ను ఖాతాలో వేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని