Virat Kohli : నాపై వచ్చే విమర్శలను పట్టించుకోను.. : విరాట్‌ కోహ్లీ

ఉప్పల్‌ మైదానంలో కోహ్లీ(Virat Kohli) సెంచరీ మోత మోగించాడు. దీంతో ఐపీఎల్‌లో ఆరు శతకాలు బాది గేల్‌ రికార్డును సమం చేశాడు.

Updated : 19 May 2023 11:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : తప్పక విజయం సాధించాల్సిన మ్యాచ్‌(SRH vs RCB)లో కింగ్‌ కోహ్లీ(Virat Kohli) ఉప్పల్‌ మైదానంలో చెలరేగి ఆడాడు. సన్‌రైజర్స్‌(Sunrisers Hyderabad) బౌలర్లను ఊచకోత కోస్తూ.. అద్భుత సెంచరీని నమోదు చేశాడు. అత్యవసరమైన విజయాన్ని అందించి జట్టు ప్లేఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచాడు. అయితే, ఇప్పటి వరకూ వచ్చిన విమర్శలపై మ్యాచ్‌ అనంతరం కోహ్లీ స్పందించాడు. బయటి నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోనని స్పష్టం చేశాడు.

‘గతంలోని గణాంకాలను నేను పట్టించుకోను. ఇది నా ఆరో ఐపీఎల్‌ శతకం. నేను ఇప్పటికే చాలా ఒత్తిడిలో ఉన్నందుకు కొన్ని సార్లు నాకు నేను తగినంత క్రెడిట్‌ ఇచ్చుకోను. అలాగే ఇతరులు బయట నుంచి చేసే విమర్శలను నేను పట్టించుకోను. అది వారి అభిప్రాయం మాత్రమే. ఇక పరిస్థితులకు తగ్గట్లు ఆడటం గర్వంగా ఉంటుంది’ అని కోహ్లీ అన్నాడు.

ఇక మిడిల్‌ ఓవర్లలో నెమ్మదిస్తున్నాడన్న విమర్శలపై కోహ్లీ స్పందిస్తూ.. ఫ్యాన్సీ షాట్లు ఆడకుండా ఉండాలని.. టెక్నిక్‌ కట్టుబడి ఆడాలని వివరించాడు. ‘నేను ఎప్పుడూ ఫ్యాన్సీ షాట్లు ఆడే వ్యక్తిని కాను. మేం ఏడాదిలో 12 నెలలు ఆడాల్సి ఉంటుంది. ఫ్యాన్సీ షాట్లు ఆడి వికెట్‌ సమర్పించుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఐపీఎల్‌ తర్వాత టెస్టు క్రికెట్‌(WTC Final) రానుంది. నా టెక్నిక్‌కు కట్టబడి ఉండి.. జట్టుకు విజయాలనందించడానికి మార్గాలను అన్వేషించాలి’ అని కోహ్లీ వివరించాడు.

ఇక ఈ మ్యాచ్‌లో బెంగళూరు 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో తన ప్లేఆఫ్స్‌ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని