INDW vs ENGW: దీప్తి శర్మ ‘హెచ్చరికలు చేశాం’’ వ్యాఖ్యలపై స్పందించిన ఇంగ్లాండ్‌ కెప్టెన్‌

మహిళల క్రికెట్‌లో అలజడి సృష్టిస్తోన్న ‘మన్కడింగ్‌’ (రనౌట్‌)  వివాదం తీవ్రస్థాయిలోకి వెళ్లేలా ఉంది. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేలో ఆ జట్టు బ్యాటర్ ఛార్లీ డీన్‌ను..

Published : 27 Sep 2022 01:10 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మహిళల క్రికెట్‌లో అలజడి సృష్టిస్తోన్న ‘మన్కడింగ్‌’ (రనౌట్‌)  వివాదం తీవ్రస్థాయికి వెళ్లేలా ఉంది. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేలో ఆ జట్టు బ్యాటర్ ఛార్లీ డీన్‌ను భారత బౌలర్‌ దీప్తి శర్మ ఇలాగే రనౌట్‌ చేసింది. దీంతో ఆయా జట్లకు అనుకూలంగా మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో ఆ సంఘటనపై టీమ్‌ఇండియా బౌలర్‌ దీప్తి శర్మ స్పందిస్తూ.. ‘‘అప్పటికే చాలా సార్లు ఛార్లీ డీన్‌ను హెచ్చరించాం’’ అని ఓ వీడియోలో చెప్పింది. ఆ కామెంట్లు మరోసారి వైరల్‌గా మారడంతో ఇంగ్లాండ్‌ మహిళల జట్టు కెప్టెన్ హీథర్‌ నైట్ స్పందించింది. 

‘‘మ్యాచ్‌ ముగిసిపోయింది. చట్టబద్ధంగానే ఛార్లీ ఔటై పెవిలియన్‌కు చేరింది. మ్యాచ్‌ను గెలిచేందుకు భారత్‌కు అర్హత ఉంది. అలాగే సిరీస్‌ను కైవసం చేసుకొన్నారు. ఔట్‌ చేయకముందు ఛార్లీకి ఎలాంటి హెచ్చరికలు ఇవ్వలేదు. వారికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే రన్‌ అవుట్ నిర్ణయంపై ఇబ్బంది పడకపోతే.. దానికి ఇలా హెచ్చరికల గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని హీథర్‌ నైట్  ట్వీట్లు చేసింది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని