IND vs ENG: ఆడేది నాలుగో మ్యాచ్.. అలవోకగా కేన్, విరాట్ వికెట్లు
కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లీ ప్రపంచ స్థాయి బ్యాటర్లు. ఒకరు క్రీజ్‌లో పాతుకుపోతే వికెట్ ఇవ్వడు.. మరొకరు పరుగుల రారాజు.. అయితే వీరిద్దరిని ఒక యువ బౌలర్ బెంబేలెత్తించాడు. ఇక ఆడుతోంది నాలుగో మ్యాచ్.. కానీ వరల్డ్ క్లాస్ బ్యాటర్లకే చెమటలు పట్టించేలా బంతులను సంధిస్తున్నాడు. అతడే ఇంగ్లాండ్ కొత్త
ఇంటర్నెట్ డెస్క్: కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లీ ప్రపంచ స్థాయి బ్యాటర్లు. ఒకరేమో క్రీజ్‌లో పాతుకుపోతే వికెట్ ఇవ్వరు.. మరొకరు పరుగుల రారాజు.. అయితే వీరిద్దరిని ఒక యువ బౌలర్ బెంబేలెత్తించాడు. ఇక ఆడుతోంది నాలుగో మ్యాచ్.. కానీ వరల్డ్ క్లాస్ బ్యాటర్లకే చెమటలు పట్టించేలా బంతులను సంధిస్తున్నాడు. అతడే ఇంగ్లాండ్ కొత్త పేసర్ మాథ్యూ పాట్స్.. ఇదివరకు ఈ పేరు కూడా విని ఉండరు.. న్యూజిలాండ్ సిరీస్‌లో ఈ యువ పేసర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌నే హడలెత్తించాడు. ఆ సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్సుల్లో కేన్‌ను మూడుసార్లు పెవిలియన్‌కు చేర్చాడు. లార్ట్స్ టెస్టులో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన మాథ్యూ పాట్స్... తాను వేసిన మొదటి టెస్టు తొలి ఓవర్లోనే విలియమ్సన్‌ను ఔట్ చేసి సంచలనం సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ మంచి స్వింగ్, పేస్‌తో బంతులు వేస్తూ కేన్ వికెట్ పడగొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసి ఇంగ్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఇక కివీస్‌తో లీడ్స్‌లో జరిగిన మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో విలియమ్సన్‌ను మరోసారి పాట్స్ బోల్తా కొట్టించాడు. వికెట్ కీపర్ బెయిర్‌స్టోకి క్యాచ్ ఇచ్చి కేన్ పెవిలియన్‌కు చేరాడు. మాథ్యూ పాట్స్ 3 మ్యాచ్‌ల్లో 23.03 సగటుతో 14 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. తాజాగా టీమ్ఇండియాతో జరుగుతోన్న ఐదో టెస్టు (కరోనా కారణంగా గతేడాది వాయిదా పడిన మ్యాచ్)లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఔట్ చేశాడు. అతడితోపాటు హనుమ విహారి వికెట్ కూడా పడగొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ విరాట్ వికెట్ తీసి సంచలనం సృష్టిస్తాడేమో చూడాలి. 23 ఏళ్ల ఇంగ్లాండ్ యువ సంచలనం ప్రపంచ క్రికెట్లో నిలకడగా రాణిస్తూ అండర్సన్, బ్రాడ్ల తరవాత ఇంగ్లాండ్ జట్టుకు ప్రధాన పేసర్ అవుతాడేమో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. పాట్స్ ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్లో డర్హమ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 24 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన పాట్స్ 77 వికెట్లు తీసి రాణించడంతో ఇంగ్లాండ్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్‌లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్‌కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్‌కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్‌గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్‌గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్‌లో రైల్ నెట్‌వర్క్‌పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్‌వర్క్‌పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్‌గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్‌పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్‌తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్‌కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్‌కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్‌కు పారిస్ ఒలింపిక్స్‌లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్‌కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్‌లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్‌లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్‌కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్‌లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్‌కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?