FIFA: ఫిఫా మహిళల ప్రపంచకప్‌ 2023 ఛాంపియన్‌గా స్పెయిన్‌.. ఇంగ్లాండ్‌ని ఓడించి తొలి టైటిల్‌ కైవసం

ఫిఫా మహిళల ప్రపంచకప్‌ 2023 (FIFA Women's World Cup Final) ఛాంపియన్‌గా స్పెయిన్‌ (Spain) అవతరించింది.

Published : 20 Aug 2023 18:22 IST

సిడ్నీ: ఫిఫా మహిళల ప్రపంచకప్‌ 2023 (FIFA Women's World Cup Final) ఛాంపియన్‌గా స్పెయిన్‌ (Spain) అవతరించింది. ఆదివారం సిడ్నీలో జరిగిన ఫైనల్‌లో 1-0తో ఇంగ్లాండ్‌ (England)ను ఓడించి స్పెయిన్ తొలి టైటిల్‌ను అందుకుంది. కెప్టెన్ ఓల్గా కార్మోనా 29వ నిమిషంలో గోల్ చేసి స్పెయిన్‌కు ఆధిక్యాన్ని అందించింది. తర్వాత ఇంగ్లాండ్ అటాకింగ్ గేమ్‌ ఆడినా స్కోరును సమం చేయలేకపోయింది. దీంతో తొలి అర్ధ భాగంలో స్పెయిన్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్థంలో ఇరుజట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని