T20 World Cup: ప్రపంచకప్‌ బరిలో నిలిచే జట్లు... ఆటగాళ్లు.. టీమ్‌ఇండియా షెడ్యూల్‌ ఇదే!

టీ20 ప్రపంచకప్‌ పోరు షురూ అయింది. ఆదివారం నుంచి క్వాలిఫయిర్‌ మ్యాచ్‌లతో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా వేదికగా మెగా టోర్నీ జరగనుంది. ఇక అక్టోబర్‌ 22 నుంచి సూపర్‌-12 పోరు మొదలుకానుంది.

Updated : 15 Oct 2022 17:22 IST

(ఫొటో సోర్స్‌: ఐసీసీ ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి సమయం ఆసన్నమైంది. అక్టోబర్‌ 16 నుంచి మ్యాచ్‌లు (ఆదివారం) ప్రారంభమవుతాయి. అయితే ఇది క్వాలిఫయింగ్‌ రౌండ్‌. అంటే ఎనిమిది జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి తలపడతాయి. శ్రీలంక, నమీబియా, నెదర్లాండ్స్‌, యూఏఈ కలిపి గ్రూప్‌-ఏ.. ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్‌, జింబాబ్వే జట్లు గ్రూప్-బిలో ఉన్నాయి. అందులో గెలిచిన నాలుగు జట్లు అక్టోబర్‌ 22 నుంచి మొదలయ్యే సూపర్‌-12 పోటీలకు అర్హత సాధిస్తాయి. 

గత టీ20 ప్రపంచకప్‌లో పాల్గొన్న ఎనిమిది జట్లు ఇప్పటికే సూపర్‌-12కు దూసుకెళ్లాయి. ఆతిథ్య హోదాలో ఆస్ట్రేలియా స్థానం ఖరారు కాగా.. భారత్, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు నేరుగా అర్హత సాధించాయి. మరి ప్రపంచకప్ బరిలో దిగే ఆటగాళ్లు ఎవరో తెలుసుకోండి.. 

భారత్‌: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్, దీపక్ హుడా, రిషభ్‌ పంత్, దినేశ్‌ కార్తిక్‌, హార్దిక్ పాండ్య, ఆర్‌ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్, అర్ష్‌దీప్‌ సింగ్, మహమ్మద్ షమీ

స్టాండ్‌బై ఆటగాళ్లు:  మహమ్మద్ సిరాజ్‌, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్


అఫ్గానిస్థాన్‌: మహమ్మద్ నబీ (కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, రహ్మతుల్లా గుర్బాజ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, దర్విష్ రసూలి, ఫరీద్‌ అహ్మద్ మాలిక్, ఫాజల్‌ హక్ ఫరూఖి, హజ్రతుల్లా జజాయ్, ఇబ్రహీం జద్రాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్ ఉల్‌ హక్, క్వైస్ అహ్మద్, రషీద్ ఖాన్, సలీమ్ సఫి, ఉస్మాన్ ఘని

రిజర్వ్‌ ఆటగాళ్లు: అఫ్సర్ జజాయ్, అష్రాఫ్, రహమత్ షా, గుల్బదిన్ నైబ్


ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), అస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్‌, టిమ్ డేవిడ్, జోష్‌ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవెన్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్, మ్యాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా


ఇంగ్లాండ్‌: జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, హారీ బ్రూక్, సామ్ కరన్, క్రిస్ జొర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, అదిల్ రషీద్‌, ఫిల్‌ సాల్ట్, బెన్ స్టోక్స్, రీసె టోప్లే, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, అలెక్స్ హేల్స్

రిజర్వ్‌ ఆటగాళ్లు: లియామ్ డాసన్, రిచర్డ్ గ్లీసన్, మిల్స్


బంగ్లాదేశ్‌: షకిబ్ అల్ హసన్ (కెప్టెన్), సబ్బిర్ రహ్మాన్, మెహిదీ హసన్ మిరాజ్, అఫిఫ్‌ హొస్సైన్, మొస్సాడెక్ హొస్సైన్, లిట్టన్ దాస్, యాసిర్ అలీ, నురుల్ హసన్, ముస్తాఫిజర్ రహ్మాన్, సైఫుద్దిన్, నజ్ముల్ హొస్సైన్, నసుమ్ అహ్మద్

స్టాండ్‌బై ఆటగాళ్లు: ఇస్లామ్‌, మహెది హసన్, రిషద్ హొస్సైన్, సౌమ్య సర్కార్


పాకిస్థాన్‌: బాబర్ అజామ్ (కెప్టెన్), షాదాబ్‌ ఖాన్, అసిఫ్‌ అలీ, హైదర్ అలీ, హారిస్ రవుఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్దిల్‌ షా, మహమ్మద్ హస్నైన్, మహమ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్, వసీమ్‌, నసీమ్ షా, షహీన్ షా అఫ్రిది, షాన్ మసూద్, ఉస్మాన్ ఖాదిర్

రిజర్వ్ ఆటగాళ్లు: ఫఖర్ జమాన్, మహమ్మద్ హారిస్, షాన్వాజ్ దహాని


దక్షిణాఫ్రికా: టెంబా బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్, హైన్రిచ్‌ క్లాసెన్, రీజా హెడ్రిక్స్, కేశవ్ మహరాజ్‌, ఐదెన్ మార్‌క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, ఆన్రిచ్ నోకియా, వ్యాన్‌ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబాడ, రిల్లే రొస్సొ, తబ్రాజ్‌ షంషి, ట్రిస్టాన్‌ స్టబ్స్

రిజర్వ్‌: ఫోర్టున్, మార్కో జాన్‌సెన్, ఫెహ్లుక్వాయో


న్యూజిలాండ్: కేన్‌ విలియమ్సన్ (కెప్టెన్), టిమ్‌ సౌథీ, ఐష్‌ సోధి, మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, మార్టిన్ గప్తిల్, లాచ్లన్ ఫెర్గూసన్, డేవన్ కాన్వే, మార్క్ చాప్‌మన్, మైకెల్‌ బ్రాస్‌వెల్, ట్రెంట్‌ బౌల్ట్, ఫిన్‌ అలెన్


క్వాలిఫయిర్‌లో తలపడే జట్లు

శ్రీలంక: డాసున్ శనక (కెప్టెన్), దనుష్క గుణతిలక, పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక, భానుక రాజపక్స, ధనంజయ డిసిల్వా, వహిందు హసరంగ, మహీష్‌ తీక్షణ, జెఫ్రే వాండర్సే, చమిక కరుణరత్నె

రిజర్వ్‌: దుష్మంత చమీర (ఫిట్‌నెస్‌ సాధించాలి), లాహిరు కుమార (ఫిట్‌నెస్‌ సాధించాలి), దిల్షాన్‌ మదుషంక, ప్రమోద్ మదుషాన్


వెస్టిండీస్‌: నికోసల్ పూరన్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్,  యానిక్ కారియా, జాన్‌సన్ ఛార్లెస్, షెల్డన్‌ కాట్రెల్, షిమ్రోన్ హెట్మయేర్, జాసన్ హోల్డర్, అకీల్ హొసేన్, అల్జారీ జోసెఫ్‌, బ్రాండన్ కింగ్, ఇవిన్ లూయిస్, కేల్‌ మయేర్స్, మెకాయ్, రీఫెర్, ఒడియన్ స్మిత్


జింబాబ్వే: క్రెగ్ ఇర్విన్ (కెప్టెన్), రైన్ బర్ల్, రెగిస్ చకబ్వా, టెండాయ్ చతర, బ్రాడ్లే ఇవాన్స్, లూక్ జాగ్వే, క్లివ్ మదాండే, వెస్లే మధెవెరె, వెల్లింగ్టన్ మసకద్జ, టోనీ మున్యాంగ, బ్లెసింగ్‌ ముజరబాని, రిచర్డ్‌ ఎన్‌గరవ, సికిందర్ రజా, మిల్టన్ షుంబా, సీన్ విలియమ్స్

రిజర్వ్‌: తనక చివాంగ, కైయా, కెవిన్ కసుజ, మరుమని, విక్టర్ నైయుచి


నమీబియా: గెర్హార్డ్‌ ఎరాస్మస్ (కెప్టెన్), జేజే స్మిత్, డివాన్ లా కాక్, స్టీఫన్ బార్డ్, నికోల్ లాఫ్టీ ఈటన్, జాన్ ఫ్రైలింక్‌, డేవిడ్ వైజ్, రుబెన్ ట్రంపెల్మన్, జానె గ్రీన్, బెనార్డ్‌ స్కాల్ట్జ్, టంగెని, లుగమెని, మైకెల్‌ వాన్ లింగెన్, బెన్ షికాంగో, కార్ల్ బిర్కెన్‌స్టాక్‌, లోహన్ లౌరెన్స్, హెలావో య ఫ్రాన్స్


నెదర్లాండ్స్‌: స్కాట్ ఎడ్వర్డ్స్‌ (కెప్టెన్), కొలిన్ అకర్‌మన్, షారిజ్ అహ్మద్, లోగన్ వాన్ బీక్, టామ్‌ కూపర్, బ్రాండన్ గ్లోవర్, టిమ్‌ వాన్‌డర్ గుగ్టెన్, ఫ్రెడ్ క్లాసెన్, బాస్ డి లీడె, పాల్‌ వాన్ మీకెరెన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే. స్టీఫెన్ మైబుర్గ్‌, తేజ నిడమానురు, మాక్స్‌ ఓడౌడ్, టిమ్‌ ప్రింగ్లే, విక్రమ్ సింగ్


యూఈఏ: సీపీ రిజ్వాన్‌ (కెప్టెన్‌), వ్రిత్య అరవింద్, చిరాగ్ సూరి, ముహమ్మద్ వసీమ్‌, బాసిల్ హమీద్, ఆర్యన్ లక్రా, జవార్ ఫరీద్, కషిఫ్‌ దౌద్, కార్తిక్ మైయప్పన్, అహ్మద్ రజా, జహూర్ ఖాన్, జునైద్ సిద్దిఖి, సబిర్ అలీ, అలిషాన్ షరఫు, అయాన్‌ ఖాన్

స్టాండ్‌బై ఆటగాళ్లు: సుల్తానా అహ్మద్, ఫహద్ నవాజ్, విష్ణు సుకుమారన్‌, ఆదిత్య శెట్టి, సచిత్‌ శర్మ


ఐర్లాండ్‌: ఆండ్రూ బాల్బిర్నీ (కెప్టెన్‌), మార్క్‌ అదైర్, కర్టిస్ క్యాంఫెర్‌, గారెత్ డెలానీ, జార్జ్‌ డాక్‌రెల్, స్టీఫెన్ దొహెనీ, ఫియోన్‌ హ్యాండ్, జోష్‌ లిటిల్, బారీ మెక్‌కార్తీ, కానర్‌ ఒల్ఫెర్ట్‌, సిమి సింగ్, పాల్ స్టిర్లింగ్‌, హ్యారీ టెక్టర్, లోర్కాన్‌ టక్కర్, గ్రాహమ్‌ హుమె


స్కాట్లాండ్‌: రిచీ బెరింగ్‌టన్ (కెప్టెన్), జార్జ్‌ మున్సె, మైకెల్ లీస్క్, బార్డ్‌లే వీల్, క్రిస్‌ సోలె, క్రిస్‌ గ్రీవ్స్‌, సఫ్యాన్‌ షరిఫ్, జోష్‌ డేవ్‌, మ్యాథ్యూ క్రాస్‌, కాలమ్ మాక్లియోడ్, హమ్జా తాహిర్, మార్క్‌ వాట్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, మెకెల్ జోన్స్‌, క్రెయిగ్‌ వాలెస్


మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఇలా.. 

* అక్టోబర్‌ 16 నుంచి 21వ తేదీ వరకు వరకు క్వాలిఫయిర్‌ రౌండ్‌లో భాగంగా ఎనిమిది జట్లు 12 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లు అన్నీ మన కాలమానం ప్రకారం ఉదయం 9.30గంటలకు, మధ్యాహ్నం 1.30గంటలకు నిర్వహిస్తారు. అందులో నాలుగు జట్లు సూపర్‌-12 పోటీలకు అర్హత సాధిస్తాయి.

* అసలైన సమరం అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 12 జట్లు (నేరుగా వచ్చిన ఎనిమిదితోపాటు అర్హత సాధించిన నాలుగు) టైటిల్‌ కోసం తలపడతాయి. 

* టీమ్‌ఇండియా మ్యాచ్‌ల విషయానికొస్తే.. పాకిస్థాన్‌తో అక్టోబర్‌ 23న (ఆదివారం) మొదటి మ్యాచ్‌ ఆడనుంది. మెల్‌బోర్న్‌ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది.

* అక్టోబర్ 27న క్వాలిఫయిర్‌లో గ్రూప్‌ A నుంచి అర్హత సాధించిన రెండో జట్టుతో ఆడనుంది. ఆ మ్యాచ్‌ మధ్యాహ్నం 12.30 గంటలకు.. వేదిక సిడ్నీ.

* అక్టోబర్ 30న దక్షిణాఫ్రికాతో కీలక పోరు.. అయితే సాయంత్రం 4.30గంటలకు పెర్త్‌ వేదికగా మ్యాచ్‌ జరుగుతుంది. 

* నవంబర్ 2న బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. వేదిక అడిలైడ్. 

* సూపర్‌-12లో భారత్‌ చివరి మ్యాచ్‌ నవంబర్ 6న ఉంటుంది. అయితే క్వాలిఫయిర్‌ రౌండ్‌లో అర్హత సాధించిన B గ్రూప్‌లోని మొదటి జట్టుతో తలపడుతుంది. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగే మ్యాచ్‌ మధ్యాహ్నం 1.30 గంటలకు.

* నవంబర్‌ 9, 10 తేదీల్లో సెమీస్‌ -1 , సెమీస్‌ -2 పోరు ఉండనుంది. అలాగే టైటిల్‌ విజేతను తేల్చే ఫైనల్‌ మ్యాచ్‌ నవంబర్ 13న మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని