Ganguly: రహానేకు వైస్‌కెప్టెన్సీనా!.. సెలక్టర్ల ఉద్దేశం అర్థం కావట్లేదు: గంగూలీ

ఏడాదిన్నర పాటు జట్టుకు దూరమైన అజింక్య రహానేను భారత టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌గా ఎందుకు నియమించారో అర్థం కావట్లేదని మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ అన్నాడు

Updated : 30 Jun 2023 08:22 IST

దిల్లీ: ఏడాదిన్నర పాటు జట్టుకు దూరమైన అజింక్య రహానేను భారత టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌గా ఎందుకు నియమించారో అర్థం కావట్లేదని మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ అన్నాడు. 35 ఏళ్ల రహానె డబ్ల్యూటీసీ ఫైనల్‌తో టీమ్‌ఇండియాలోకి పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే.  ఆ మ్యాచ్‌లో రాణించిన అతణ్ని సెలక్షన్‌ కమిటీ, వెస్టిండీస్‌ పర్యటనకు వైస్‌ కెప్టెన్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో శుభ్‌మన్‌ లాంటి కుర్రాడికి ఆ బాధ్యతలు అప్పగించాల్సిందని మాజీలు అభిప్రాయపడ్డారు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో గంగూలీని అడిగినప్పుడు.. ‘‘నేను అదే అనుకుంటున్నా. అయితే రహానేకు వైస్‌కెప్టెన్సీ ఇవ్వడం వెనుకడుగు అనుకోను. కానీ 18 నెలలు జట్టుకు దూరమై, పునరాగమనంలో ఒక్క మ్యాచ్‌ ఆడిన ఆటగాడికి వైస్‌ కెప్టెన్సీ ఇవ్వడంలో సెలక్టర్ల ఉద్దేశం అర్థం కావట్లేదు. జట్టులో జడేజా కూడా ఉన్నాడు. వైస్‌ కెప్టెన్సీకి అతడు అర్హుడే. సెలక్షన్‌లో నిలకడ ఉండాలి’’ అని చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని