అదరగొట్టిన జడ్డూ

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు రవీంద్ర జడేజా  ఫిట్‌నెస్‌, ఫామ్‌ నిరూపించుకున్నాడు. మోకాలికి శస్త్రచికిత్స నుంచి కోలుకుని రంజీలో పునరాగమనం చేసిన అతడు తమిళనాడుపై 8 వికెట్ల ప్రదర్శన చేశాడు.

Published : 27 Jan 2023 03:16 IST

చెన్నై: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు రవీంద్ర జడేజా  ఫిట్‌నెస్‌, ఫామ్‌ నిరూపించుకున్నాడు. మోకాలికి శస్త్రచికిత్స నుంచి కోలుకుని రంజీలో పునరాగమనం చేసిన అతడు తమిళనాడుపై 8 వికెట్ల ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌ తీసిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లతో తమిళనాడును దెబ్బతీశాడు. 132 పరుగుల భారీ ఆధిక్యాన్ని దక్కించుకున్న తమిళనాడు రెండో ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే కుప్పకూలింది. 266 పరుగుల ఛేదనలో సౌరాష్ట్ర 4/1తో నిలిచింది.   ‘‘చాలా రోజుల తర్వాత బరిలో దిగి రాణించడం ఆనందంగా ఉంది. తొలిరోజు కొంచెం కష్టమనిపించింది. కానీ ఆట గడుస్తున్న కొద్దీ కుదురుకున్నా. ఈ మ్యాచ్‌లో సుదీర్ఘ స్పెల్స్‌ వేశా. రాబోయే ఆస్ట్రేలియా సిరీస్‌కు సిద్ధంగా ఉన్నా’’ అని జడ్డూ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు