మరొక్క అడుగే
పొచెఫ్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో భారత్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది.
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్
ఇంగ్లాండ్‌తో టైటిల్ పోరు
పొచెఫ్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో భారత్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. శుక్రవారం సెమీస్‌లో 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్‌ను యువ భారత్ 107/9కు పరిమితం చేసింది. బౌలర్ల ధాటికి నిలవలేకపోయిన పోయిన న్యూజిలాండ్ క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పార్షవి చోప్రా (3/20) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించింది. ఆమెతో పాటు మన్నత్, తితాస్, షెఫాలీ, అర్చన తలో వికెట్ పడగొట్టారు. జార్జియా (35), ఇసాబెలా (26) పోరాడకపోతే కివీస్ ఆమాత్రం స్కోరు కూడా చేసేది కాదు. లక్ష్యాన్ని భారత్ 14.2 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఫామ్‌లో ఉన్న శ్వేత సెహ్రావత్ (61 నాటౌట్; 45 బంతుల్లో 10×4) మరోసారి అదరగొట్టింది. కెప్టెన్ షెఫాలీ వర్మ (10), సౌమ్య తివారి (22) వెనుదిరిగినా శ్వేత ఆఖరి వరకు నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది. మరో సెమీస్‌లో ఇంగ్లాండ్ 3 పరుగుల స్వల్ప తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి భారత్‌తో టైటిల్ పోరుకు సిద్ధమైంది. మొదట ఇంగ్లాండ్ 19.5 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌట్ కాగా.. ఛేదనలో ఆసీస్ 18.4 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. ఆదివారం ఫైనల్ జరుగుతుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
నిఖత్‌కు మహీంద్రా థార్
-
Politics News
వైకాపాకు వ్యతిరేకంగా ఓటు వేస్తే చేతులు నరుక్కున్నట్లే!: మంత్రి ధర్మాన
-
World News
Russia: చిన్నారి ‘చిత్రం’పై రష్యా కన్నెర్ర.. తండ్రిని బంధించి..బాలికను దూరం చేసి!
-
India News
ChatGPT: భారత్ వెర్షన్ చాట్‌జీపీటీ ఎప్పుడంటే..? మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానమిదే..!
-
Sports News
Labuschagne:ఐపీఎల్లో నా ఫేవరెట్ టీమ్ అదే.. అశ్విన్ బెస్ట్ స్పిన్నర్: లబుషేన్
-
Movies News
Social Look: బీచ్‌లో వేదిక.. షాపులో శాన్వి.. ఆరెంజ్ దుస్తుల్లో ప్రియ!