ఓటమి దాటి.. నిరీక్షణ ముగించి
ఫైనల్లో మూడో సెట్.. పదో గేమ్.. రిబకినా బంతిని కోర్టు బయటకు కొట్టింది. అంతే ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేక.. ముఖంపై చేతులు పెట్టుకున్న సబలెంక.. కోర్టులో పడుకుండిపోయింది.
ఫైనల్లో మూడో సెట్.. పదో గేమ్.. రిబకినా బంతిని కోర్టు బయటకు కొట్టింది. అంతే ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేక.. ముఖంపై చేతులు పెట్టుకున్న సబలెంక.. కోర్టులో పడుకుండిపోయింది. తొలిసారి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలవడం వెనుక దాగి ఉన్న ఆమె శ్రమకు నిదర్శనమే ఆ కన్నీళ్లు. మహిళల డబుల్స్‌లో ఇప్పటికే యుఎస్ ఓపెన్ (2019), ఆస్ట్రేలియన్ ఓపెన్ (2021) టైటిళ్లు గెలిచిన ఆమె.. సింగిల్స్‌లో మాత్రం విజయం కోసం ఎదురు చూసింది. వింబుల్డన్ (2021), యుఎస్ ఓపెన్ (2021, 2022)లో సెమీస్‌లో నిష్క్రమించింది. కానీ ఇప్పుడా గండాన్ని దాటి.. తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో సత్తాచాటింది. ఈ విజయంతో ఆమె ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మరోసారి రెండో స్థానాన్ని ఖరారు చేసుకుంది.
రోడ్డు పక్కన చూసి..: సబలెంక అనుకోకుండానే ఆటలో అడుగుపెట్టింది. ఒకప్పటి హాకీ ఆటగాడైన తండ్రి సెర్గీ.. చిన్నతనంలో సబలెంకను ఒక రోజు కారులో తీసుకెళ్లాడు. మధ్యలో రోడ్డు పక్కన టెన్నిస్ కోర్టు కనబడడంతో అక్కడికి వెళ్లారు. అప్పుడే తొలిసారి టెన్నిస్‌తో ఆమె ప్రేమలో పడింది. 2012 నుంచి ఐటీఎఫ్ ఓపెన్ సర్క్యూట్‌లో ఆడడం మొదలెట్టిన ఆమెకు మొదట్లో పరాజయాలే ఎదురయ్యాయి. రెండేళ్ల వరకూ ప్రొఫెషనల్ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. తక్కువ స్థాయి టోర్నీల్లో విజయాలతో మెల్లగా అడుగులు వేసింది. 2017 వింబుల్డన్‌తో గ్రాండ్‌స్లామ్ అరంగేట్రం చేసింది. కానీ ఆ తర్వాత మూడేళ్ల పాటు గ్రాండ్‌స్లామ్‌ల్లో ఆశించిన ఫలితాలు దక్కలేదు. మరోవైపు డబుల్స్‌లో మాత్రం మార్టిన్స్ (బెల్జియం)తో కలిసి రెండు టైటిళ్లు సాధించింది. నంబర్‌వన్‌గానూ నిలిచింది. సింగిల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించి, టెక్నిక్‌ను మెరుగుపర్చుకోవడంపై ధ్యాస పెట్టింది. 2021 నుంచి ఆమె ఆటతీరు మారింది. ఆరడుగుల ఎత్తును సమర్థంగా ఉపయోగించుకుంటూ.. మెరుపు వేగంతో సర్వీస్‌లు చేయడంపై పట్టు సాధించింది. కచ్చితమైన ఏస్‌లను సంధించడంలో రాటుదేలింది. ప్రత్యర్థి ఊహకు అందకుండా.. షాట్లు ఆడుతూ విన్నర్లు కొట్టే విషయంలో మెరుగైంది. ఆ ఏడాది వింబుల్డన్, యుఎస్ ఓపెన్‌లో సెమీస్ వరకూ వెళ్లింది. గతేడాది మరోసారి యుఎస్ ఓపెన్‌లో సెమీస్‌లోనే ఇంటి ముఖం పట్టింది. గ్రాండ్‌స్లామ్ సింగిల్స్‌లో విజేతగా నిలవాలంటే అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సిందేనని, మరింతగా కష్టపడింది. నిరుడు డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఇదే ఉత్సాహంతో ఈ ఏడాదిని గొప్పగా మొదలెట్టింది. 2023లో ఇప్పటివరకూ ఆడిన పదకొండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ మినహా మిగతా పది మ్యాచ్‌ల్లో ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. డబుల్ ఫాల్ట్‌లు ఆమెకు బలహీనతగా ఉండేది. ఈ సీజన్‌లో ఆ బలహీనతను అధిగమించి తొలి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ అందుకుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Srikanth: విడాకుల రూమర్స్.. భార్యతో కలిసి వెళ్లాల్సి వస్తోంది: శ్రీకాంత్
-
Politics News
MLC Elections: వైకాపా పతనం ప్రారంభమైంది: తెదేపా శ్రేణులు
-
Politics News
KTR: రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు
-
India News
CBIకి కొత్త చట్టం అవసరం.. పార్లమెంటరీ కమిటీ సూచన
-
India News
Rahul Gandhi: రాహుల్ గాంధీకి జైలు శిక్ష.. ఎంపీగా అనర్హుడవుతారా..?
-
Movies News
Vishwak Sen: ఆ రెండు సినిమాలకు సీక్వెల్స్ తీస్తాను: విష్వక్ సేన్