అంతర్జాతీయ క్రికెట్‌కు విజయ్‌ వీడ్కోలు

టీమ్‌ఇండియా మాజీ టెస్టు ఓపెనర్‌ మురళీ విజయ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 38 ఏళ్ల విజయ్‌.. చివరగా 2018 డిసెంబర్లో ఆస్ట్రేలియాతో పెర్త్‌లో టెస్టు మ్యాచ్‌ ఆడాడు.

Published : 31 Jan 2023 02:52 IST

చెన్నై: టీమ్‌ఇండియా మాజీ టెస్టు ఓపెనర్‌ మురళీ విజయ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 38 ఏళ్ల విజయ్‌.. చివరగా 2018 డిసెంబర్లో ఆస్ట్రేలియాతో పెర్త్‌లో టెస్టు మ్యాచ్‌ ఆడాడు. ఆ మ్యాచ్‌ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన విజయ్‌.. మళ్లీ టీమ్‌ఇండియా తలుపు తట్టలేకపోయాడు. 2008-09 సీజన్లో అరంగేట్రం చేసిన విజయ్‌.. 61 టెస్టులు, 17 వన్డేలు, 9 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో అతను 38.28 సగటుతో 3982 పరుగులు చేశాడు. అందులో 12 శతకాలు, 15 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 167. ‘‘ప్రపంచ క్రికెట్లో, వ్యాపారపరంగా నేను కొత్త అవకాశాల వైపు వెళ్లాలనుకుంటున్నా. ఇక ముందూ ఆటలో కొనసాగుతూ సరికొత్త వాతావరణాల్లో నాకు నేను సవాలు విసురుకోవాలని అనుకుంటున్నా. ఇది క్రికెటర్‌గా నా తర్వాతి అడుగు. నా జీవితంలో కొత్త అధ్యాయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. నాకు అవకాశాలు కల్పించిన బీసీసీఐ, తమిళనాడు క్రికెట్‌ సంఘం, చెన్నై సూపర్‌కింగ్స్‌లకు కృతజ్ఞుడిని. తోడ్పాటు అందించిన సహచర ఆటగాళ్లు, కోచ్‌లకు ధన్యవాదాలు. నా కుటుంబం, స్నేహితులు లేకుంటే నేనింత దూరం వచ్చేవాడిని కాదు’’ అని విజయ్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని