ఆ పిచ్‌ గురించి క్యురేటరే చెప్పాలి

భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య రెండో టీ20కి ఆతిథ్యం ఇచ్చిన లఖ్‌నవూలోని ఏకనా పిచ్‌ గురించి క్యురేటరే సరైన సమాధానం చెప్పగలడని టీమ్‌ఇండియా బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రె అన్నాడు.

Published : 31 Jan 2023 02:52 IST

లఖ్‌నవూ: భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య రెండో టీ20కి ఆతిథ్యం ఇచ్చిన లఖ్‌నవూలోని ఏకనా పిచ్‌ గురించి క్యురేటరే సరైన సమాధానం చెప్పగలడని టీమ్‌ఇండియా బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రె అన్నాడు. విపరీతంగా బంతి స్పిన్‌ తిరిగిన ఈ పిచ్‌పై రెండు జట్ల బ్యాటర్లు స్కోరు చేసేందుకు చాలా కష్టపడిన నేపథ్యంలో అతడిలా అన్నాడు. ‘‘ఏకనా పిచ్‌పై క్యురేటరే స్పందించాలి. రెండు జట్లకు ఈ పిచ్‌ సవాల్‌ విసిరింది. అదృష్టవశాత్తూ ఆఖర్లో భారత్‌ మ్యాచ్‌పై నియంత్రణ సాధించింది. మొదట ఈ పిచ్‌ను చూసినప్పుడు ఎండినట్లు కనిపించింది. మధ్యలో కొంచెం గడ్డి కూడా ఉంది. మ్యాచ్‌ రోజు మాత్రం మొత్తం మారిపోయింది. బంతి అనూహ్యంగా తిరిగింది’’ అని మాంబ్రె అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని