PV Sindhu: ఆ స్వర్ణం కోసం అయిదేళ్లు ఎదురుచూశా: పీవీ సింధు

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం కోసం అయిదేళ్లు ఎదురు చూశానని భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు చెప్పింది.

Updated : 05 Feb 2023 08:52 IST

దిల్లీ: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం కోసం అయిదేళ్లు ఎదురు చూశానని భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు చెప్పింది. శనివారం ప్రొ వాలీబాల్‌ లీగ్‌ ఆరంభానికి అతిథిగా వచ్చిన సందర్భంగా ఆమె మాట్లాడింది. ‘‘ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం చాలా పెద్ద ఘనత. ఒలింపిక్స్‌ పతకం తర్వాత అంతటి ఆనందం ఈ టోర్నీ గెలవడంతోనే వచ్చింది. ఎందుకంటే ఈ స్వర్ణం కోసం అయిదేళ్లు ఎదురు చూశా. అంతకుముందు రెండు రజతాలు, రెండు కాంస్యాలు గెలిచా. చివరికి 2019లో ప్రపంచ ఛాంపియన్‌ని అయ్యా’’ అని సింధు తెలిపింది. 2013, 14 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో కాంస్యాలు నెగ్గిన సింధు.. 2017, 18లో రజతాలు సొంతం చేసుకుంది. 2019 టోర్నీ ఫైనల్లో జపాన్‌ స్టార్‌ నవోమి ఒకుహరపై నెగ్గి విజేతగా నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని