చూడ్డానికి ఒకేలా.. కానీ తేడాలెన్నో!
ఆ రెండు రేసులూ ఒకేలా కనిపిస్తాయి.. ట్రాక్‌పై రయ్‌మంటూ కార్లు దూసుకెళ్తాయి. కానీ పోల్చి చూస్తే ఫార్ములావన్, ఫార్ములా-ఈ మధ్య ఎన్నో తేడాలు. కొన్ని సారూప్యతలు.
ఈనాడు క్రీడావిభాగం
ఆ రెండు రేసులూ ఒకేలా కనిపిస్తాయి.. ట్రాక్‌పై రయ్‌మంటూ కార్లు దూసుకెళ్తాయి. కానీ పోల్చి చూస్తే ఫార్ములావన్, ఫార్ములా-ఈ మధ్య ఎన్నో తేడాలు. కొన్ని సారూప్యతలు. హైదరాబాద్‌లో ఫార్ములా- ఈ రేసు నేపథ్యంలో వీటి గురించే చర్చ జోరుగా సాగుతోంది. మరి ప్రఖ్యాత ఫార్ములావన్‌కు.. అత్యాధునిక ఫార్ములా- ఈకి మధ్య తేడాలేంటో చూసేద్దాం పదండి!
* ఫార్ములావన్ (ఎఫ్1) రేసింగ్ అభిమానులకు సుపరిచితమే. ఈ ఎఫ్1 ఛాంపియన్‌షిప్‌కు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 1950లో తొలిసారి ఈ రేసులు జరిగాయి. ఫార్ములా-2, 3 ఛాంపియన్‌షిప్స్ కూడా ఉన్నాయి. ఎఫ్1కు అర్హత సాధించే ప్రక్రియలో ఇవి ఉపయోగపడతాయి. ఫార్ములా- ఈ (ఎఫ్‌ఈ) 2014లో శ్రీకారం చుట్టుకుంది. ఎఫ్1, ఎఫ్‌ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లను ప్రపంచ ఆటోమొబైల్ సమాఖ్య (ఎఫ్‌ఐఏ) నిర్వహిస్తోంది. ఈ రెండు రేసుల్లోనూ సింగిల్ సీటర్ కార్లు పరుగులు పెడతాయి.
* రెండు ఛాంపియన్‌షిప్స్‌లోనూ సీజన్లో కొన్ని రేసులు నిర్వహిస్తారు. 2023లో ఎఫ్1లో 23, ఎఫ్‌ఈలో 16 రేసులు నిర్వహిస్తారు. ఒక్కో రేసులో రేసర్లు గెలిచిన పాయింట్ల ఆధారంగా చివరకు అగ్రస్థానాల్లో నిలిచే వాళ్లను ప్రపంచ ఛాంపియన్‌గా నిర్ణయిస్తారు. ఎఫ్1లో 10, ఎఫ్‌ఈలో 11 జట్లు బరిలో ఉన్నాయి.
* ఎఫ్1, ఎఫ్‌ఈకి ప్రధాన తేడా ట్రాక్‌పై పరుగెత్తే కార్లు. ఎఫ్1లో ఇంధనంతో నడిచే కార్లను ఉపయోగిస్తే, ఎఫ్‌ఈలో విద్యుత్ సాయంతో పరుగెత్తే కార్లను వాడుతున్నారు. కర్బన ఉద్గారాలు లేకుండా రేసులు నిర్వహించడంతో పాటు విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే ఎఫ్‌ఈ మొదలైంది.
* ఎఫ్1లో ప్రాక్టీస్, అర్హత, ప్రధాన రేసులు ఇలా ఓ రౌండ్ కోసం మూడు రోజులు కేటాయిస్తారు. కానీ ఎఫ్‌ఈలో ఓ రౌండ్‌ను రెండు రోజుల్లోనే ముగిస్తారు. శుక్రవారం తొలి ప్రాక్టీస్ రేసు, శనివారం రెండో ప్రాక్టీస్, అర్హత, ప్రధాన రేసులుంటాయి.
* ఎఫ్1 రేసులో లాగా పిట్‌స్టాప్స్ (రేసు మధ్యలో చక్రాలు మార్చుకోవడానికి) అవసరం ఎఫ్‌ఈలో పెద్దగా ఉండదు. ఒకవేళ చక్రం పంక్చర్ అయితేనే విద్యుత్ కార్లు పిట్‌స్టాప్‌కు వస్తాయి. సాధారణంగా విశాలంగా, ఎక్కువ పొడవు, వేగవంతంగా ఉండే ట్రాక్‌పై ఎఫ్1 రేసులు నిర్వహిస్తారు. కానీ ఎఫ్‌ఈ రేసుల నిర్వహణకు స్ట్రీట్ సర్క్యూట్‌లు సరిపోతాయి.
* ఎఫ్1 రేసులో ఓ డ్రైవర్ సగటున 300 కిలోమీటర్ల దూరాన్ని పూర్తిచేస్తాడు. ఎఫ్‌ఈలో అది 90 నుంచి 150 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేందుకు ఎఫ్-1 కారుకు సుమారు 2.4 సెకన్లు పట్టగా.. ఎఫ్‌ఈ కారుకు 2.8 సెకన్ల సమయం అవసరమవుతుంది. రేసులో ఎఫ్1 కారు శబ్దం సగటు 134 డెసిబుల్స్ కాగా.. ఎఫ్‌ఈ కారు శబ్దం 80 డెసిబుల్స్ మాత్రమే.
* ఎఫ్‌ఈతో పోలిస్తే ఎఫ్1 కారు అధిక వేగంతో వెళ్లగలదు. ఎఫ్1 కారు గరిష్ఠంగా గంటకు 380 నుంచి 400 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. కానీ ఎఫ్‌ఈ కారు గరిష్ఠ వేగం 322 కిలోమీటర్లు. బరువు విషయానికి వస్తే 798 కిలోలతో ఎఫ్1 కారే కాస్త తేలిగ్గా ఉంటుంది. ఎఫ్‌ఈ కారు బరువు 840 కిలోలు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Hyd Airport MetroP: ఎయిర్‌పోర్టు మెట్రో కోసం భూ సామర్థ్య పరీక్షలు
-
Sports News
Dhoni - IPL: పెయింటర్‌గానూ అదరగొట్టిన ధోనీ.. వీడియో వైరల్!
-
Politics News
KTR: బండి సంజయ్, రేవంత్ ఒక్కసారైనా పరీక్ష రాశారా?: కేటీఆర్
-
General News
TSPSC: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ. . మరో వ్యక్తి అరెస్టు
-
Movies News
Manoj: ఆ వివాదం గురించి.. వాళ్లనే అడగండి: మంచు మనోజ్
-
India News
Yediyurappa: యడియూరప్ప ఇంటిపై దాడి.. రాళ్లు విసిరిన నిరసనకారులు..!