క్రికెట్‌కు ఫించ్‌ గుడ్‌బై

ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. 36 ఏళ్ల ఫించ్‌.. ఆట నుంచి రిటైరవుతున్నట్లు మంగళవారం ప్రకటించాడు.

Published : 08 Feb 2023 03:14 IST

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. 36 ఏళ్ల ఫించ్‌.. ఆట నుంచి రిటైరవుతున్నట్లు మంగళవారం ప్రకటించాడు. అయితే బిగ్‌బాష్‌లో లీగ్‌లో అతడు రెనెగేడ్స్‌ తరఫున కొనసాగుతాడు. ప్రపంచవ్యాప్తంగా ఇతర టీ20 లీగ్‌లలో ఆడే అంశాన్ని కూడా పరిశీలిస్తాడు. ఫించ్‌ రిటైర్మెంట్‌ ఊహించిందే. అతడు చివరగా 2018లో టెస్టు మ్యాచ్‌ ఆడాడు. పేలవ ఫామ్‌ నేపథ్యంలో ఫించ్‌ నిరుడు వన్డే క్రికెట్‌ నుంచి రిటైరయ్యాడు. అతడు 76 టీ20ల్లో ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించాడు. ఇది ప్రపంచ రికార్డు. అతడు 103 టీ20ల్లో 34.28 సగటుతో 3120 పరుగులు చేశాడు. 146 వన్డేల్లో 38.89 సగటుతో 5406 పరుగులు సాధించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని