జాస్మిన్‌, శశి ముందంజ

సొంతగడ్డపై ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. జాస్మిన్‌ (60 కేజీ), శశి చోప్రా (63 కేజీ) ముందంజ వేశారు.

Published : 18 Mar 2023 02:14 IST

శ్రుతి పరాజయం
ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌

దిల్లీ: సొంతగడ్డపై ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. జాస్మిన్‌ (60 కేజీ), శశి చోప్రా (63 కేజీ) ముందంజ వేశారు. బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ కాంస్య పతక విజేత జాస్మిన్‌ అయితే 90 సెకన్లలోనే ప్రత్యర్థి పని పట్టింది. తొలి రౌండ్లో బెట్రైస్‌ ఆంబ్రోస్‌ (టాంజానియా)ను ఆమె తేలిగ్గా మట్టికరిపించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన జాస్మిన్‌.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. పోటీ ఆరంభమైన కొద్దిసేపటికే జాస్మిన్‌ పంచ్‌లను బెట్రైస్‌ తట్టుకోలేకపోవడంతో రిఫరీ బౌట్‌ నిలిపేసి భారత బాక్సర్‌ను విజేతగా ప్రకటించాడు. మరో బౌట్లో శశి 5-0తో టెరెసియా (కెన్యా)ను చిత్తు చేసింది. బలమైన డిఫెన్స్‌కు తోడు మెరుపు పంచ్‌లతో ప్రత్యర్థిపై విరుచుకుపడిన శశి.. ఘన విజయాన్ని అందుకుంది. మరోవైపు శ్రుతి యాదవ్‌ (70 కేజీ)కు చుక్కెదురైంది. ఆమె 0-5తో జోహుపాన్‌ (చైనా) చేతిలో ఓడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు