టెస్టులను అలానే ఆడాలి..

ఓ టెస్టు మ్యాచ్‌ ఎన్ని రోజుల్లో పూర్తయిందనే దాని కంటే.. అది జనరంజకంగా సాగిందా లేదా అన్నదే ముఖ్యమని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ అన్నాడు.

Published : 18 Mar 2023 02:15 IST

దిల్లీ: ఓ టెస్టు మ్యాచ్‌ ఎన్ని రోజుల్లో పూర్తయిందనే దాని కంటే.. అది జనరంజకంగా సాగిందా లేదా అన్నదే ముఖ్యమని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ అన్నాడు. ‘‘టెస్టు మ్యాచ్‌ ఎలాంటి పిచ్‌పైనైనా ఆడొచ్చు. దానిపై ఎక్కువ పేస్‌, బౌన్స్‌, స్వింగ్‌ ఉండొచ్చు. లేదంటే స్పిన్‌కు సహకరించొచ్చు. పిచ్‌ ఎలా ఉన్నా ఆట ఆకర్షణీయంగా సాగిందా లేదా అన్నదే ముఖ్యం. మ్యాచ్‌ ఎన్ని రోజుల్లో ముగిసిందనేది అనవసరం. ఐసీసీ, ఎంసీసీ ఇతర క్రికెట్‌ సంస్థలు టెస్టు క్రికెట్‌ను ఎలా నంబర్‌వన్‌ ఫార్మాట్‌గా ఉంచాలో ఆలోచిస్తున్నాయి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. మూడు రోజుల్లో మ్యాచ్‌లు ముగియడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. విదేశీ పర్యటనలకు వెళ్లే జట్లేకు తమ అనుకూల పిచ్‌లు లభించవు. అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా కఠిన సాధన చేయడంపై దృష్టి సారించాలి. టెస్టు క్రికెట్‌ అత్యుత్తమ ఫార్మాట్‌గా ఉండాలంటే బౌలర్ల అనుకూల పరిస్థితులు ఉండాల్సిందే. బౌలర్‌ విసిరే ప్రతి బంతి ఒక సవాల్‌గా నిలవాలి. దానికి బ్యాటర్‌ సమాధానం చెప్పాలి. ఆ సవాల్‌ సరిగా లేకుంటే ఆట ఎలా ఆకర్షణీయంగా ఉంటుంది’’ అని సచిన్‌ అన్నాడు. వన్డే క్రికెట్‌ రానురాను ప్రాభవం కోల్పోయిందని సచిన్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని